ఆన్ లైన్ గేమింగ్ ఓవర్ ? రూ. 32 వేల కోట్ల ఇండస్ట్రీకి షాక్ !

Published : Aug 20, 2025, 05:30 PM IST
Online gaming

సారాంశం

India Online Gaming Bill 2025: కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు, 2025ను ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదిస్తే.. 32 వేల కోట్ల గేమింగ్ మార్కెట్ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది..

India Online Gaming Bill 2025: భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుంది. ఆన్ లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ కు బ్రేక్ వేయడానకి సిద్దమైంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ & రెగ్యులేషన్ బిల్లు 2025కు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు భారతదేశ ఆన్‌లైన్ గేమింగ్ సామ్రాజ్యానికి సవాళ్లను విసురుతోంది. ముఖ్యంగా రియల్-మనీ ప్లాట్‌ఫారమ్‌లు Dream11, Games24x7, Winzo, GamesKraft, 99Games, KheloFantasy, My11Circle వంటి గేమింగ్ దిగ్గజాలను ఈ కొత్త చట్టం సంక్షోభంలో నెట్టి అవకాశముంది.

ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ & రెగ్యులేషన్ బిల్లు ప్రధానంగా ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించడం, చట్టవిరుద్ధమైన బెట్టింగ్ కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా రూపొందించబడింది. అలాగే.. మనీ బేస్డ్ గేమ్స్ ను పూర్తిగా నిషేధం విధించడం, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన ప్రకటనలను నిషేధించాలని భావిస్తోంది. 

అలాగే బ్యాంకులు, ఆర్థిక సంస్థలను సంబంధిత లావాదేవీలను ప్రాసెస్ చేయకుండా చెక్ వేయడం ఈ బిల్లులోని ప్రధాన అంశాలు. అంతేకాకుండా బిల్లును ఉల్లంఘించినవారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, భారీ మొత్తంలో జరిమానాలు విధించవచ్చు.

భారతదేశ ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్ ప్రస్తుతం విలువ $3.7 బిలియన్ ( రూ. 32,216.27 కోట్లు), 2029 నాటికి ఈ విలువ $9.1 బిలియన్ (7.55 లక్షల కోట్ల రూపాయలు)కు చేరుతుందని అంచనా. ఈ బిల్లు అమలులోకి వస్తే ఆ గేమింగ్ లైన్ పూర్తిగా మటాష్ అవుతుంది. ఈ గేమింగ్ ఇండస్ట్రీ అంచనాల ప్రకారం.. ప్రస్తుత ఎంటర్‌ప్రైజ్ వాల్యుయేషన్ రూ. 2 లక్షల కోట్లకు పైగా, వార్షిక ఆదాయం రూ. 31,000 కోట్లు, పన్నుల రూపంలో రూ. 20,000 కోట్లు ఉండగా, CAGR 20%తో 2028 నాటికి రెట్టింపు అవ్వనుందని అంచనా. ఈ బిల్లు గేమింగ్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనున్నది.

ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు, 2025పై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ప్రతిపాదిత బిల్లు పౌరులను రక్షించడంతో పాటు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని అన్నారు. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలో డిజిటల్ టెక్నాలజీల పెరుగుదల పౌరులకు అపారమైన ప్రయోజనాలను తెచ్చిపెట్టింది, సాంకేతికత దుర్వినియోగం వల్ల కలిగే సంభావ్య హాని నుండి సమాజం రక్షించడానికి ఈ చర్య తీసుకున్నట్టు తెలిపారు.

బిల్లు ఎందుకు ప్రత్యేకమైనది?

ఈ బిల్లు ఈ-స్పోర్ట్స్, ఆన్‌లైన్ సోషల్ గేమ్‌లను ప్రోత్సహిస్తుంది, అలాగే హానికరమైన ఆన్‌లైన్ మనీ గేమింగ్ సేవలు, ప్రకటనలు, వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను నిషేధిస్తుంది. ఆన్‌లైన్ ఫాంటసీ క్రీడల నుండి ఆన్‌లైన్ జూదం (పోకర్, రమ్మీ, ఇతర కార్డ్ గేమ్‌లు వంటివి), ఆన్‌లైన్ లాటరీల వరకు అన్ని ఆన్‌లైన్ బెట్టింగ్, జూదం కార్యకలాపాలకు ఈ బిల్లు చెక్ పెడుతుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం