భారత్ శ్రీలంకకు అండగా ఉంటుంది - విదేశాంగ మంత్రి జైశంకర్

By team telugu  |  First Published Jan 22, 2023, 11:14 AM IST

భారతదేశం శ్రీలంకకు అండగా ఉంటుందని విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వం నైబర్ హుడ్ ఫస్ట్ అనే విధానానికి కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాంటించారు. 


భారతదేశం శ్రీలంకకు అండగా ఉంటుందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో శుక్రవారం కొలంబోలో జైశంకర్ సమావేశం అయ్యారు. తన శ్రీలంక పర్యటన వివరాలు ఆయన ట్విట్టర్ ద్వారా తాజాగా ప్రస్తావించారు. దక్షిణ పొరుగుదేశానికి భారత్ అందించిన సహాయాన్ని వెల్లడించారు.

డీజీసీఏ డైరెక్టర్ జనరల్‌గా విక్రమ్ దేవ్ దత్.. ఫిబ్రవరి 28 నుంచి బాధ్యతల స్వీకరణ

Latest Videos

‘‘భారత్ నమ్మకమైన పొరుగు దేశమని, భాగస్వామి అని శ్రీలంక కోసం అవసరమైతే అదనపు మైలు వరకు వెళ్లడానికి సిద్ధంగా ఉందని నేను నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ‘‘నైబర్‌హుడ్ ఫస్ట్’’ అనే విధానానికి ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారనే ప్రకటనతోనే ఈ రోజు నేను ఇక్కడకు వచ్చాను. ఈ విపత్కర సమయంలో మేము శ్రీలంకకు అండగా ఉంటాము. శ్రీలంక ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమిస్తుందనే నమ్మకం ఉంది’’ అని జైశంకర్ శ్రీలంక నాయకత్వాన్ని కలిసిన తర్వాత పేర్కొన్నారు.

India stands with Sri Lanka. A brief look at my visit. pic.twitter.com/5SSsZBFSmH

— Dr. S. Jaishankar (@DrSJaishankar)

జై శంకర్ ట్విటర్లో షేర్ చేసిన వీడియోలో శ్రీలంక కౌంటర్ అలీ సబ్రీ, అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, ప్రధాని దినేశ్ గుణవర్ధనే, ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస, మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స పలువురు ప్రముఖ నేతలతో తాను జరిపిన సమావేశాల గురించి ప్రస్తావించారు. హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్ మెంట్ ప్రాజెక్టులకు భారతీయ నిబద్ధతను పెంచడానికి లెటర్స్ ఆఫ్ ఎక్స్ఛేంజ్ పై సంతకాలు చేయడాన్ని కూడా తాను చూశానని ఆయన అన్నారు. గాలే, కాండీలో ఇండియన్ హౌసింగ్ ప్రాజెక్టు మూడో దశలో భాగంగా 300 ఇళ్లు, బదుల్లా, అనురాధపుర జిల్లాల్లో మోడల్ విలేజ్ హౌసింగ్ ప్రాజెక్టు అయిన నువారా అలియాను ఆయన ప్రారంభించారు.

స్వాతి మలివాల్, బీజేపీ మధ్య ముదురుతున్న వివాదం.. డీసీడబ్ల్యూ చీఫ్ ను సస్పెండ్ చేయాలని ఢిల్లీ ఎల్జీకి లేఖ

భారత్ తరఫున 50 బస్సులను ఆ దేశ రవాణా శాఖ మంత్రి బండ్ల గుణవర్దనేకు అందజేశారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పర్యటించిన సందర్భంగా అక్కడి వ్యాపార వర్గాలతో ఆయన ముచ్చటించారు.

click me!