ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది.
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భూకంపం సంభవించింది. జనవరి 22న ఉదయం 8.58 గంటలకు రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం పితోర్‌ఘర్ సమీపంలో ఉందని పేర్కొంది. పితోర్‌ఘర్‌కు ఉత్తర-వాయువ్య దిశలో 23 కి.మీ దూరంలో, 10 కి. మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టుగా తెలిపింది. అయితే భూకంపం వల్ల ఎటువంటి నష్టం చోటుచేసుకున్నట్టుగా ఇప్పటివరకు ఎలాంటి నివేదికలు వెలువడలేదు.
ఇదిలా ఉంటే స్థానిక విపత్తు నిర్వహణ కార్యాలయం నుండి అందిన సమాచారం ప్రకారం.. భూకంప కేంద్రం పితోర్‌ఘర్ జిల్లాలో 10 కిలోమీటర్ల లోతులో ఉంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు.