బిజినెస్ ఫ్రెండ్లీ విధానాలు: మోడీ ఫ్రాన్స్ టూర్‌‌పై సెయింట్ గోబెన్ సీఈఓ

Published : Jul 10, 2023, 05:44 PM IST
బిజినెస్ ఫ్రెండ్లీ విధానాలు: మోడీ ఫ్రాన్స్ టూర్‌‌పై  సెయింట్ గోబెన్ సీఈఓ

సారాంశం

ఈ నెల  13, 14 తేదీల్లో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లనున్నారు. సెయింట్ గోబెన్ సీఈఓ బెనోట్ బాజీన్  స్పందించారు. 


న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ఈ నెల  13, 14 తేదీల్లో ఫ్రాన్స్ లో పర్యటించనున్నారు. బాస్టిల్  డే పరేడ్ కు  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గౌరవ అతిథిగా  హాజరుకానున్నారు.  బాస్టిల్ డే పరేడ్ కు  విదేశీ ప్రముఖులను ఆహ్వానించడం  అరుదు.
ప్రధాని మోడీ ఫ్రాన్స్  టూర్ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని  రెండు దేశాలు భావిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ప్రధాని మోడీ  ఫ్రాన్స్ టూర్ నుద్దేశించి  సెయింట్ గోబైన్  సంస్థ సీఈఓ బెనోట్ బాజీన్  ట్విట్టర్ వేదికగా స్పందించారు.  ప్రధాని మోడీ ఫ్రాన్స్ పర్యటన పట్ల ఆయన హార్షం వ్యక్తం  చేశారు.  ప్రధానికి ఆయన  స్వాగతం పలికారు.  ఇండియా ప్రభుత్వ విధానాలపై ఆయన ప్రశంసలు కురిపించారు.  ఇండియా ప్రభుత్వ విధానాలు  బిజినెస్ ఫ్రెండ్లీగా ఆయన అభివర్ణించారు.  తమ సంస్థ  ఇండియాలో  పెట్టుబడులు పెడుతున్న విషయాన్ని  ప్రస్తావించారు. 

 

ఫ్రాన్స్,  ఇండియా  25 ఏళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి ఆయన గుర్తు  చేశారు.  ఇండియాలోని 33 పారిశ్రామిక ప్రదేశాలను సందర్శించిన విషయాన్ని ఆయన గుర్తు  చేసుకున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం