వీధి కుక్కల స్వైరవిహారం.. కోజికోడ్‌లో స్కూళ్లకు సెలవు.. ఉపాధి పనులకూ బ్రేక్

Published : Jul 10, 2023, 05:10 PM IST
వీధి కుక్కల స్వైరవిహారం.. కోజికోడ్‌లో స్కూళ్లకు సెలవు.. ఉపాధి పనులకూ బ్రేక్

సారాంశం

కేరళలోని కోజికోడ్‌లో కూతలి పంచాయతీ పరిధిలో కుక్కలు స్వైర విహారం చేశాయి. ఎదురుగా ఎవరు కనిపిస్తే వారిని కరిచేశాయి. ఆదివారం ఓ కుక్కల గుంపు ఐదుగురిపై దాడి చేశాయి. కానీ, అధికారులు వీటిని అదుపులోకి తీసుకురాలేకపోయారు. దీంతో మరుసటి రోజు అంటే ఈ నెల 10వ తేదీన ఆ పంచాయతీ పరిధిలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.  

తిరువనంతపురం: కేరళలోని కోజికోడ్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎదురుగా ఎవరు కనిపిస్తే వారిని కరిచేస్తున్నాయి. ఆదివారం ఈ కుక్కల గుంపు కనిపించిన వారిపై కనిపించినట్టే దాడి చేశాయి. ఈ కుక్కలను అధికారులు అదుపులోకి తేలేకపోయారు. దీంతో సోమవారం ఆ ఏరియాలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

కుక్కల భయానికి కోజికోడ్‌లోని కూతలి పంచాయత్ పరిధిలోని ఏడు పాఠశాలలు, 17 అంగన్వాడీలకూ సోమవారం సెలవు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం వీధి కుక్కలు దాడులు చేయడం ప్రారంభించిన తర్వాత అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిన్న సాయంత్రం ఐదుగురిని వీధి కుక్కలు కరిచేశాయి. దీంతో అక్కడ పరిస్థితులు మారిపోయాయి. ఇంటి బయటకు పిల్లలను పంపించడం అపాయంగా మారిపోయింది. ఈ పరిస్థితుల కారణంగా వంద రోజుల ఉపాధి హామీ కింద చేసే పనులనూ నిలిపేశారు.

కూతలిలోని ఒకేషనల్ హైయర్ సెకండరీ స్కూల్, వెంగప్పట్ట యూపీ స్కూల్, కూతలి యూపీ స్కూల్, కల్లోడు ఎల్పీ స్కూల్, పైతోట్ ఎల్పీ స్కూల్, కల్లూరు కూతలి ఎంఎల్పీ స్కూల్‌కు సోమవారం సెలవు ప్రకటించారు.

Also Read: పేషెంట్‌తో నర్సు ఎఫైర్.. హాస్పిటల్‌లో సెక్స్ చేస్తుండగా మరణించిన పేషెంట్

గత నెల కన్నూర్‌లో కుక్క ఓ తొమ్మిదేళ్ల బాలికపై దాడి చేయడం కలకలం రేపింది. మూడు కుక్కలు బాలికపై తీవ్రంగా దాడి చేశాయి. గార్డెన్‌లో ఆడుకుంటున్న బాలికపై దాడి చేసి అక్కడి నుంచి నోటితో కరుచుకుని లాక్కుపోయే ప్రయత్నం చేశాయి. ఆ బాలిక తలకు, పొట్టలో, తొడలు, చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

PREV
click me!

Recommended Stories

Udhayanidhi Stalin Speech: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ సూపర్ స్పీచ్| Asianet Telugu
Nitish Kumar Takes Oath in Rajya Sabha: రాజ్యసభలో నితీశ్ కుమార్ ప్రమాణం | Asianet News Telugu