Pakistan attack on India: పాక్‌కు దిమ్మ‌దిరిగే షాక్ ఇస్తున్న భార‌త్‌.. యుద్ధ విమానాల కూల్చివేత

Published : May 08, 2025, 09:34 PM ISTUpdated : May 08, 2025, 10:02 PM IST
Pakistan attack on India: పాక్‌కు దిమ్మ‌దిరిగే షాక్ ఇస్తున్న భార‌త్‌.. యుద్ధ విమానాల కూల్చివేత

సారాంశం

పాకిస్థాన్ చ‌ర్య‌ల‌కు భార‌త్ ధీటుగా స్పందిస్తోంది. జ‌మ్ములో ప‌లు ప్రాంతాల‌ను టార్గెట్ చేసుకొని దాడుల‌కు దిగిన పాకిస్థాన్ యుద్ధ‌విమాల‌ను కూల్చి వేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 3 యుద్ధ విమానాల‌ను కూల్చి వేసిన‌ట్లు తెలుస్తోంది.   

పాకిస్థాన్ దుశ్చ‌ర్య‌కు దిగింది. ఆప‌రేష‌న్ సిందూర్‌తో భార‌త ఆర్మీ ఉగ్ర వాదుల స్థావ‌రాల‌పై దాడి చేస్తే. పాకిస్థాన్ మాత్రం సామాన్య ప్ర‌జ‌ల‌ను టార్గెట్ చేస్తూ దాడుల‌కు దిగుతోంది. జ‌మ్మూలో రాకెట్ల దాడితో రెచ్చిపోతోంది. అయితే పాక్ దాడిని భార‌త ఆర్మీ బ‌లంగా తిప్పి కొడుతోంది. 

పాకిస్థాన్ క‌య్యానికి కాలు దువ్వుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు సరిహద్దు గ్రామాలపై కాల్పులు కొనసాగిస్తూ వ‌చ్చిన పాక్ ఆర్మీ ఈసారి ఏకంగా  జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ దాడికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.

 

ప్ర‌స్తుతం జ‌మ్ము మొత్తం బ్లాక్ అవుట్‌లో ఉంది. విద్యుత్ స‌ర‌ఫ‌రాను, ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను పూర్తిగా నిలిపివేశారు. అయితే పాకిస్థాన్ చ‌ర్య‌ల‌ను భార‌త్ ధీటుగా తిప్పి కొడుతోంది. పాకిస్థాన్ యుద్ధ విమానాల‌ను కూల్చి వేసింది. పాకిస్థాన్ కు చెందిన ఫైట‌ర్ జెట్ ఎఫ్‌16 ఒకటి, రెండు 17తో పాటు డ్రోన్‌ల‌ను కూల్చి వేసింది. ఎస్‌400తో పాకిస్థాన్‌కు చెందిన మిసైల్స్‌ను భార‌త్ పేల్చి వేసింది. యాంటి మిసైజ్ సిస్ట‌మ్‌కు దొరక్కుండా పాకిస్థాన్ దాడుల‌కు దిగింది. సాంబా సెక్టార్‌లో పాక్ దాడుల‌కు దిగింది. 

జమ్ము విమానాశ్రయం దగ్గర ఓ డ్రోన్ పేలుడు చోటు చేసుకుంది. దాంతో ఫైటర్ జెట్లు అలర్ట్‌ అవ్వగా, భారత వాయుసేన తన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను చురుగ్గా నడిపించింది. ప్రధానంగా S-400 వ్యవస్థ ద్వారా పాక్ ప్రయోగించిన ఎనిమిది క్షిపణులను జమ్ము సివిల్ ఎయిర్‌పోర్ట్, సంపా, ఆర్.ఎస్. పురా, ఆర్నియా పరిసరాల్లో అడ్డుకుంది. జమ్ము యూనివర్శిటీ సమీపంలో రెండు పాక్ డ్రోన్లను కూల్చి వేశారు. అదేవిధంగా, జైసల్మేర్‌లోనూ పాకిస్తాన్ డ్రోన్లు కనిపించగా, వాటిని కూడా భారత భద్రతా బలగాలు వెంటనే తిప్పికొట్టాయి.

ఈ దాడుల్లో ప్రాణనష్టంపై ఇంకా అధికారికంగా సమాచారం రాలేదు. పాక్ దాడులకు తక్షణమే ప్రతిస్పందించిన భారత భద్రతా వ్యవస్థ, పాక్ దాడులను పూర్వాభాసం కాకుండానే నిలువరించడంలో విజయం సాధించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu
Rajinikanth Pressmeet: సీఎం విజయ్ పై రజినీకాంత్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu