Ayodhya: దేశమంతా రామస్మరణ.. ప్రాణ ప్రతిష్ట ముహూర్తంలో డెలివరీలు.. రామ, సీతల పేర్లు

By Mahesh K  |  First Published Jan 23, 2024, 2:13 PM IST

జనవరి 22వ తేదీన అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ శుభ ముహూర్తంలోనే గర్భిణులు డెలివరీ కావాలని చాలా మంది దంపతులు కోరుకున్నారు. వైద్యులపై ఒత్తిడి తెచ్చారు. యూపీ మొదలు మహారాష్ట్ర, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో ఇలాంటివి జరిగాయి. ఈ ముహూర్తంలో ప్రసవించిన పిల్లలకు రామ, సీత పేర్లను పెట్టుకున్నారు.
 


Ram: అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన ముహూర్తంలోనే డెలివరీలు చేయాలని చాలా మంది దంపతులు వైద్యులను కోరారు. ఒత్తిడి తెచ్చారు. చాలా మంది డెలివరీ కూడా అయ్యారు. ఆ తర్వాత పుట్టిన పిల్లలకు రామ్, రాఘవ్, రాఘవేంద్ర, రామేంద్ర, రఘు, సీత, జానకి వంటి పేర్లు పెట్టుకున్నారు. ఈ ధోరణి చాలా రాష్ట్రాల్లో కనిపించింది.

ఉత్తరప్రదేశ్ మొదలు మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల వరకు చాలా మంది గర్భిణిలు, వారి భర్తలు ప్రాణ ప్రతిష్ట ముహూర్తంలోనే డెలివరీ చేయాలని వైద్యులను కోరారు. ‘ఇది చాలా పవిత్రమైన రోజు. ఈ చారిత్రక రోజునే నేను డెలివరీ కావాలని మా కుటుంబం భావించింది. నేను బాలికను ప్రసవించాను. ఆమెకు సీత అనే పేరు పెట్టాలని అనుకుంటున్నాం’ అని బాలింత అశ్విని బగ్లి తెలిపారు.

Latest Videos

కర్ణాటకలోని ఓ హాస్పిటల్‌లో ఇలాగే.. జనవరి 22వ తేదీన డెలివరీ చేయాలని వైద్యులకు కనీసం 50 విజ్ఞప్తులు వచ్చినట్టు తెలిసింది. అయితే, అందులో సుమారు 20 మంది గర్భిణిలకు జనవరి 22నే డెలివరీ చేశారు. ‘రామ భక్తులమైన మేం మా బాబుకు శ్రీరామ్ పేరు పెట్టాలని అనుకుంటున్నాం’ అని కర్ణాటక విజయపురలోని జేఎస్ఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో డెలివరీ అయిన తర్వాత 30 ఏళ్ల బోరమ్మ తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని గణేశ్ శంకర్ విద్యార్థి మెమోరియల్ మెడికల్ కాలేజీలో జనవరి 22న 25 మంది పిల్లలు జన్మించినట్టు ఓ అధికారి తెలిపారు.

Also Read : Pakistan: రామ మందిరం ఓపెనింగ్ పై పాకిస్తాన్ ఫైర్.. ఏమన్నదంటే?

తన బిడ్డకు రామ్ అని పేరు పెట్టిన ఓ తల్లి మాట్లాడుతూ.. ఈ పేరు బాబు పర్సనాలిటీ పై మంచి ప్రభావం వేస్తుందని ఆశిస్తున్నామని వివరించింది.

ఒడిశాలోని కేంద్రపార, జగత్‌సింగ్ పూర్‌ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో కనీసం ఆరుగురు పిల్లలు ప్రసవం అయ్యారు. వారికి తల్లిదండ్రులు రామ్ లేదా సీత పేర్లను పెట్టుకున్నారు.

click me!