ఇండియాలో పెరిగిన కరోనా రోగుల రికవరీ: మొత్తం కేసులు 3,45,35,763కి చేరిక

By narsimha lodeFirst Published Nov 24, 2021, 10:23 AM IST
Highlights


ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 9,283 కోవిడ్ కేసులు రికార్డయ్యాయి.  దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,45,35,763కి చేరుకొన్నాయి.


న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో 9,283 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 3,45,35,763కి చేరుకొన్నాయి. 538 రోజుల కనిష్ట స్థాయికి కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.దేశంలో కరోనా కేసులు 10 వేలకు దిగువన నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఊపిరి పీల్చుకొంటున్నారు. దేశంలో నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే రికార్డయ్యాయి. కేరళ రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 4,972 కరోనా కేసులు రికార్డయ్యాయి.

నిన్న ఒక్క రోజే coronaతో 437 మంది మంది మరణించారు. దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,66,564కి చేరింది. Indiaలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1.11,481 లక్షలకి చేరిందని icmr తెలిపింది. కరోనా రికవరీ రేటు 98.33 శాతంగా నమోదైంది. నిన్న ఒక్క రోజే కరోనా నుండి 10,949 మంది కోలుకొన్నారు. దీంతో కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 3,39,34,547 గా నమోదైంది.

కరోనా యాక్టివ్ కేసులు మొత్తం కేసుల్లో 1 శాతంగా ఉన్నాయి.  యాక్టివ్ కేసులు 0.32 శాతంగా నమోదైనట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 2020 మార్చి నుండి ఈ కేసులు అత్యల్పంగా నమోదయ్యాయి.  కరోనా రోగుల రికవరీ  537 రోజుల కనిష్టస్థాయికి చేరుకొంది. 

రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 0.80 శాతంగా నమోదైంది.  51 రోజులుగా 2 శాతానికి కంటే రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు నమోదైంది. వీక్లీ కరోనా పాజిటివిటీ రేటు 0.93 శాతంగా నమోదైంది.  61 రోజులుగా 2 శాతం కంటే తక్కువ వీక్లీ కరోనా పాజిటివిటీ రేటు నమోదైందని ఐసీఎంఆర్ తెలిపింది. కేరళ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. ప్రతి రోజూ  ఈ రాష్ట్రంలో వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదౌతున్నాయి. కరోనాతో మరణించే రోగుల సంఖ్య తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకొంది. నిన్నటి రోజున కేరళలో 370 మంది మరణించారు.దేశ వ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 76, 58,203 మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకొన్నారు. ఇప్పటివరకు దేశంలో 118 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకొన్నారని ప్రభుత్వం తెలిపింది.

also read:ఏపీ: 24 గంటల్లో 196 మందికి పాజిటివ్.. 20,68,672కి చేరిన సంఖ్య, కృష్ణా జిల్లాలో అత్యధికం

ఇండియాలో 2020 ఆగష్టు 7న 20 లక్షలు, ఆగష్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు,సెప్టెంబర్ 16న 50 లక్షలకు కరోనా కేసులు చేరాయి. సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షల కేసులు దాటాయి.డిసెంబర్ 19న కోటి కేసులను దాటాయి.ఈ ఏడాది మే 4న  రెండు కోట్ల కేసులను దాటాయి.ఈ ఏడాది జూన్ 23న కరోనా కేసులు మూడు కోట్లను దాటాయి.

click me!