ఇద్దరు బిడ్డల తల్లితో పోలీస్ వివాహేతర సంబంధం... వివాహిత అనుమానాస్పద మృతి, పరారీలో ప్రియుడు

Arun Kumar P   | Asianet News
Published : Nov 24, 2021, 09:09 AM IST
ఇద్దరు బిడ్డల తల్లితో పోలీస్ వివాహేతర సంబంధం... వివాహిత అనుమానాస్పద మృతి, పరారీలో ప్రియుడు

సారాంశం

పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధాన్ని కలిగివున్న ఇద్దరు పిల్లల తల్లి అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లాలో వెలుగుచూసింది. 

బెంగళూరు: పోలీస్ అధికారితో అక్రమ సంబంధం కలిగివున్న వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమంగళూరు జిల్లాలో చోటుచేసుకుంది. ప్రియురాలి మృతి తర్వాత సదరు పోలీస్ విధులకు హాజరుకాకుండా పరారీలో వుండటం మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. 

వివరాల్లోకి వెళితే... karnataka chikkamangaluru district సిడ్లఘట్ట పట్టణంలోని మారమ్మ దేవాలయం సర్కిల్ లో రాజేశ్వరి(35)-వెంకటేష్(38) దంపతులు ఇద్దరు ఆడపిల్లలతో కలిసి నివాసముండేవారు. అయితే అదే కాలనీలో నివాసముండే ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ అనంత్ కుమార్ కన్ను రాజేశ్వరిపై పడింది. ఆమెకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఇలా గత నాలుగేళ్లుగా ఆమెతో extramarital affair కొనసాగిస్తున్నాడు.

అయితే ఇటీవల రాజేశ్వరితో అనంత్ కుమార్ గొడవపడ్డట్లు సమాచారం. ఈ గొడవ తర్వాత వివాహిత అనుమానాస్పద రీతితో ప్రాణాలో కోల్పోయింది. మంగళవారం ఉరి వేసుకున్న స్థితితో రాజేశ్వరి మృతదేహాన్ని భర్త వెంకటేష్ గుర్తించాడు. ఈ ఘటన తర్వాత అనంత్ కుమార్ పరారీలో వుండటం రాజేశ్వరి మృతిపై అనుమానం కలుగుతోంది.

read more  ‘ఆమె మోసం చేసింది.. వదలొద్దు..’ సెల్ఫీ వీడియో తీసుకుని.. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య..

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని కిందకుదించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే తన భార్య రాజేశ్వరిని అనంత్ కుమార్ హత్య చేసాడని భర్త వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో వున్న హెడ్ కానిస్టేబుల్ కోసం గాలింపు చేపట్టారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే వివాహిత మృతిపై క్లారిటీ వస్తుందని పోలీసులు తెలిపారు.

అయితే బాధిత కుటుంబానికి స్థానికులు అండగా నిలిచారు. వివాహితతో అక్రమసంబంధం పెట్టుకుని... ఇప్పుడు ఆమె మృతికి కారణమైన హెడ్ కానిస్టేబుల్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే తల్లిని కోల్పోయిన ఇద్దరు ఆడపిల్లలతో కూడిన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. 

ఇదే కర్ణాటకలో మరో దారుణం వెలుగుచూసింది. రాజధాని నగరం బెంగళూరులో నలుగురు దుండగులు ఓ వ్యక్తిని తన ఇద్దరు కూతుళ్ల కళ్లముందే అతి కిరాతకంగా హత్య చేశారు. బీహార్ కు చెందిన దీపక్ కుమార్ సింగ్ (46) భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి బెంగళూరులో నివాసం ఉంటున్నారు. ఆదివారం అర్థరాత్రి నలుగురు దుండగులు దీపక్ ఇంట్లోకి చొరబడి ఆయన ఇద్దరు కూతుళ్లు చూస్తుండగానే ఆయుధాలతో దాడిచేసి చేసి అతి కిరాతకంగా చంపారు. 

read more  నిన్న మేకలదొంగల చేతుల్లో ఎస్ఐ, నేడు వాహనంతో ఢీకొట్టి ఎంవీఐ హత్య.. చెన్నైలో వరుస దారుణాలు..

అయితే దీపక్ కుమార్ గత ఏడాదిన్నరగా తన కూతుళ్లను Sexually harassing చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇద్దరు యువతులూ తన తల్లితో పాటు కళాశాలలోని మిత్రులకు చెప్పినట్టు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు కూడా దీపక్ కుమార్ సింగ్ తాగి వచ్చి కూతుళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు సమాచారం. దీంతో దీపక్ హత్య వెనుక ఆయన కుమార్తెలు చదువుతున్న కళాశాల స్నేహితులు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి.)

 

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu