కరోనా కల్లోలం: 24 గంటల్లో ఇండియాలో లక్ష దాటిన కోవిడ్ కేసులు

By narsimha lodeFirst Published Jan 7, 2022, 12:03 PM IST
Highlights

ఇండియాలో కరోనా కేసుల ఉధృతి పెరిగింది. గత 24 గంటల్లో 1.1 లక్షల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 10 రరోజుల వ్యవధిలో కరోనా కేసులు 13 రెట్లు పెరిగాయి.

న్యూఢిల్లీ: దేశంలో Corona కేసులు లక్షను దాటాయి. గత 24 గంటల్లో 1.1లక్షల కరోనా  కేసులు నమోదయ్యాయి. కరోనాతో 302 మంది కరోనాతో మరణించారు. కరోనా కేసులు 10 రోజుల వ్యవధిలో 13 రెట్లు పెరిగాయి. కరోనా Omicron కేసులు మూడు వేలకు చేరుకొన్నాయి.  శుక్రవారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల మేరకు India లో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటడంతో  వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో కరోనా రోగులు 30,836 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,71,363కి చేరుకొంది. కరోనాతో దేశంలో ఇప్పటివరకు మృతి చెందిన రోగుల సంఖ్య 4,38,178కి చేరుకొంది.  కరోనా ఓమిక్రాన్ కేసుల సంఖ్య 3,007కి పెరిగింది.

దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా ఒమిక్రాన్ కేసుల్లో 1,199 మంది కోలుకొన్నారు. మహారాష్ట్రలో 876, ఢిల్లీలో 465, కర్ణాటకలో 333,రాజస్థాన్ లో 291,కేరళలో 284, గుజరాత్ లో 204 కేసులు నమోదయ్యాయి.

గురువారం నాడు మహారాష్ట్రలో 36,265 కరోనా కేసులు నమోదయ్యాయి. ముంబైలో గత 24 గంటల్లో 31.7 శాతం కరోనా కేసులు నమోదయ్యాయి.  ఢిల్లీలోని ఒమిక్రాన్ కేసుల్లో ఎవరికీ కూడా ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ సపోర్టు అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖాధికారులు  తెలిపారు. ఢిల్లీలో కరోనా ఒమిక్రాన్ మరణాలు ఎక్కడా లేవని  ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ కూడా ప్రకటించారు.దేశంలో గత 24 గంటల్లో 15, 13, 377 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అయితే వీరిలో 1,17,100 మందికి కరోనా నిర్ధారణ అయింది.

దేశంలో గత 24 గంటల్లో 15, 13, 377 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అయితే వీరిలో 1,17,100 మందికి కరోనా నిర్ధారణ అయింది.రోజువారీ కరోనా పాజిటివటీ రేటు7.74 శాతానికి చేరింది. దేశంలోని  ముంబై నగరంలోనే 20,181 కేసులు నమోదయ్యాయి. బెంగాల్ రాష్ట్రంలో 15,421 కేసులు రికార్డయ్యాయి. ఢిల్లీలో 15,097 కేసులు నమోదయ్యాయి.  ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 15.34 శాతానికి చేరింది. అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నందునే కేసులు ఎక్కువగా వస్తున్నాయని ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 

దేశంలో కరోనా ఒమిక్రాన్ కేసులు 3,007కి చేరాయి. గత 24 గంటల్లో 377 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహరాష్ట్రలో 876 మంది ఒమిక్రాన్  బారినపడ్డారు. ఢీల్లీలో 465 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 

click me!