భారత్‌లో అదుపులోనే కరోనా.. కొత్తగా 53,256 కేసులు, 96.27 శాతానికి పాజిటివిటి రేటు

By Siva KodatiFirst Published Jun 21, 2021, 10:51 AM IST
Highlights

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ అదుపులోకి వస్తున్నట్లుగాననే కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 13,88,699 మందికి కరోనా నిర్థారణా పరీక్షలు చేయగా.. 53,256 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రోజువారీ కేసులు మూడు నెలల కనిష్టానికి చేరుకున్నాయి. 

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ అదుపులోకి వస్తున్నట్లుగాననే కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 13,88,699 మందికి కరోనా నిర్థారణా పరీక్షలు చేయగా.. 53,256 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రోజువారీ కేసులు మూడు నెలల కనిష్టానికి చేరుకున్నాయి. కోవిడ్ వల్ల నిన్న 1422 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్ 17 తర్వాత మరణాల్లో ఈస్థాయి తగ్గుదల తొలిసారి కావడం విశేషం.

Also Read:కరోనా బాధితులకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేం: సుప్రీంకు తేల్చిచెప్పిన కేంద్రం

దేశంలో ఇప్పటి వరకు 2,99,35,221 మందికి కరోనా సోకగా.. మరణాల సంఖ్య 3,88,135కి చేరుకుంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలకు పడిపోగా.. ఆ రేటు 2.44 శాతానికి పడిపోయింది. నిన్న మహమ్మారి బారి నుంచి 78,190 మంది కోలుకున్నారు. వీటితో కలిపి దేశంలో ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ల సంఖ్య 2.88 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం రికవరి రేటు 96.27 శాతానికి చేరింది. మరోవైపు గడిచిన 24 గంటల వ్యవధిలో 30,39,996 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకా తీసుకున్న వారి సంఖ్య 28 కోట్లకు చేరుకుంది. 

click me!