వివాహేతర సంబంధం : ‘భర్తను చంపడం ఎలా?...తప్పించుకోవడం ఎలా?’ గూగుల్ సెర్చ్ చేసి.. ఓ భార్య ఘాతుకం..

By AN TeluguFirst Published Jun 21, 2021, 9:32 AM IST
Highlights

మధ్యప్రదేశ్ లో దారుణ సంఘటన జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసి భర్తను కిరాతకంగా హతమార్చిందో భార్య.  అయితే హత్యకోసం ఆమె చేసిన ప్లాన్ ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది.

మధ్యప్రదేశ్ లో దారుణ సంఘటన జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసి భర్తను కిరాతకంగా హతమార్చిందో భార్య.  అయితే హత్యకోసం ఆమె చేసిన ప్లాన్ ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది.

భోపాల్ లో ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతున్న మహిళ, తన భర్త అడ్డు తొలగించుకునేందుకు గూగుల్ సాయం తీసుకుంది. ఎలా చంపాలి? ఎలా తప్పించుకోవాలి? అనే విషయాలమీద 15 గంటలపాటు ఏకధాటిగా సెర్చ్ చేసింది. భర్తను చంపేశాక ఏం తెలియని అమాయకురాలిగా ఫోజులిచ్చింది. అయితే ఫోన్ లో గూగుల్ హిస్టరీ ద్వారానే ఆమె దొరికిపోవడం ఈ కేసులు అసలు ట్విస్ట్ గా మారింది. 
 
హద్రా జిల్లా ఖేడిపూర్‌ ప్రాంతంలో జూన్ 18న ఈ ఘటన జరిగింది. ఆమీర్ అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.  ఈ నేపథ్యంలో భర్త దూరంగా ఉండడంతో అదే ఏరియాలో ఉంటున్న వ్యక్తితో అతని భార్య తబస్సుమ్ సంబంధం పెట్టుకుంది.  

లాక్ డౌన్ కారణంగా పనిలేకపోవడంతో అమీర్ మహారాష్ట్రనుంచి ఇంటికి వచ్చేశాడు. దీంతో తబస్సుమ్ కు ప్రియుడిని కలవడానికి కుదరడం లేదు. ఇక భర్త లాక్ డౌన్ వల్ల ఇక్కడే ఉండిపోతాడనే బెంగ పట్టుకుంది. అంతే ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. 

అమీర్ హత్య కోసం ఒక రోజంగా గూగుల్ లో ‘చంపడం ఎలా? ఎవరికంట పడకుండా పాతేయడం, ఆధారాలు దొరక్కుండా తప్పించుకోవడం ఎలా ?’ అనే విషయాల మీద వెతుకుతూ కూర్చుంది. అవన్నిటి సాయంతో ఓ స్కెచ్ వేసింది. అమీర్ కు ఆస్తమా ఉంది. రోజూ మందులు వాడతాడు. జూన్ 18న ఆ మందుల్ని మార్చేసింది తబస్సుమ్. 

నకిలీ మందులు తీసుకున్న అమీర్ సోయి లేకుండా పడిపోయాడు. ఆ తరువాత ప్రియుడు ఇర్ఫాన్ ను అదే రాత్రి ఇంటికి పిలిపించుకుంది. అమీర్ కాళ్లు, చేతులన్ని స్కార్ప్ లతో కట్టేసి.. ఆపై సుత్తితో తలమీద బాది చంపేశారు. తెల్లవారి తనకేం తెలియదన్నట్లుగా పోలీసుల దగ్గరికి వెళ్లి, తన భర్త రక్తపు మడుగులో పడి ఉన్నాడని నటించింది. 

అది దొంగల పని అని ముందుగా అనుకున్న పోలీసులు.. క్రైమ్ సీన్ లో తేడాగా అనిపిస్తుండడంతో అనుమానించారు. సైబర్ సెల్ నుంచి తబస్సుమ్ కాల్ డిటెయిల్స్ తెప్పించుకన్నారు. ఆమె ఫోన్ స్వాధీనం చేసుకుని గూగుల్ హిస్టరీ ద్వారా ఒక అంచనాకి వచ్చారు. 

తమ స్టైల్ లో ఇంటరాగేట్ చేయడంతో ఆమె నేరం ఒప్పుకుంది. చివరికి.. ఆ ఆంటీ, ప్రియుడ్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఇక ఈ దారుణం మీద అక్కడి టీవీ ఛానెల్స్ డిబేట్లు నడిపిస్తుండడంతో.. ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది. 

click me!