మలయాళీ నటిపై అత్యాచారం కేసు: మాజీ మంత్రి మణికందన్ అరెస్టు

By telugu teamFirst Published Jun 21, 2021, 7:56 AM IST
Highlights

మలయాళీ నటిపై అత్యాచారం కేసులో పోలీసులు మాజీ తమిళనాడు మంత్రి మణికందన్ ను అరెస్టు చేశారు. తనపై మణికందన్ అత్యాచారం చేశాడని గత నెలలో చాందినీ ఫిర్యాదు చేసింది.

చెన్నై: మలయాళీ నటిపై అత్యాచారం చేశారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న తమిళనాడు మాజీ మంత్రి, అన్నాడియంకె నేత ఎం. మణికందన్ ను పోలీసులు అదివారంనాడు అరెస్టు చేశారు. మణికందన్ ను పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు.

కోలివుడ్ నటి, మలేషియా పౌరసత్వం ఉన్న చాందినీ చేసిన అత్యాచార ఆరోపణలతో మణికందన్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి పేరుతో తనను మోసం చేసారని నటి చాందని మాజీ మంత్రి మణికందన్ మీద చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో గత నెలలో ఫిర్యాదు చేశారు. 

ఆమె ఫిర్యాదు చేసిన వెంటనే మణికందన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.  పరారీలో ఉన్న మణికందన్ ను పట్టుకోవడానికి రెండు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ నెల ఆరంభంలో ముందస్తు  బెయిల్ కోసం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జాన్ 9వ తేదీ వరకు మణికందన్ ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి మణికందన్ ఐదేళ్ల పాటు తనతో సహజీవనం చేశాడని, తాను గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించుకోవాలని బలవంతం చేశాడని ఆమె ఆరోపించింది. మూడు సార్లు తాను గర్భం తీయించుకున్నట్లు తెలిపింది. 

పెళ్లి చేసుకోవాలని తాను ఒత్తిడి చేయడంతో కిరాయి మనుషులతో బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది.

click me!