
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 39,070 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజునే కరోనాతో 491 కరోనాతో మరణించారు.నిన్న ఒక్కరోజునే 17,22,221 మంది శాంపిల్స్ సేకరించారు. ఇందులో 39,070 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
దేశంలో ఇప్పటివరకు కరోనాతో 4,27,862కి చేరుకొంది. నిన్న ఒక్క రోజే కరోనా నుండి 43,910 మంది కోలుకొన్నారు. కరోనా కేసుల కంటే రికవరీ అయిన రోగుల సంఖ్య ఎక్కువగా ఉందని ఐసీఎంఆర్ ప్రకటించింది.ఇండియాలో ఇప్పటివరకు కరోనా నుండి 3,10, 99,771 మంది కోలుకొన్నారు. కరోనా రోగుల రికవరీ రేటు 97.39 శాతానికి చేరింది.
ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1.27 శాతంగా నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.ఇండియాలోని కేరళ, మహారాష్ట్రల్లో అత్యదిక కేసులు నమోదౌతున్నాయి. ఈ రాష్ట్రాల్లో కరోనా కేసులను అదుపు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కేంద్రం ఈ రెండు రాష్ట్రాలను కోరింది. కేరళ రాష్ట్రంలో ఆరు సభ్యులుగల కేంద్ర బృందం ఇటీవల పర్యటించింది.