గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 37,724కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 11,92,915కి చేరుకొంది. వీటిలో 4,11,133 యాక్టివ్ కేసులు. కరోనా సోకిన వారిలో 7,53,049 మంది కోలుకొన్నట్టుగా కేంద్రం తెలిపింది.
న్యూఢిల్లీ:గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 37,724కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 11,92,915కి చేరుకొంది. వీటిలో 4,11,133 యాక్టివ్ కేసులు. కరోనా సోకిన వారిలో 7,53,049 మంది కోలుకొన్నట్టుగా కేంద్రం తెలిపింది. 24 గంటల్లో 648 మంది కరోనాతో మరణించారు. దీంతో
కరోనాతో దేశంలో ఇప్పటివరకు 28,400 మంది మరణించారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కరోనాతో మరణించిన రోగుల సంఖ్యలో ఇండియా స్పెయిన్ ను దాటింది. ప్రపంచంలో ఇండియా కరోనా మరణాల్లో ఏడవ స్థానంలో నిలిచింది. 8వస్థానంలో స్పెయిన్ నిలిచింది.
రాజస్ఘాన్ రాష్ట్రంలో మంగళవారం నాడు ఒక్క రోజే 983 కొత్త కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 31,373కి చేరుకొన్నాయి. కరోనాతో రాష్ట్రంలో 577 మంది మరణించారు.
also read:కరోనా రోగి ఇంట్లో మటన్ వండుకొని చోరీ
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నాడు 1430 కొత్త కేసులు రికార్డయ్యాయి. ఏడుగురు మరణించారు. రాష్ట్రంలో మొత్తం కేసులు 47,705కి చేరుకొన్నాయి.
అసోం రాష్ట్రంలో మంగళవారంనాడు 1680 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 26,772 కి చేరుకొన్నట్టుగామంత్రి హిమంత బిశ్వాస్ శర్మ తెలిపారు. మంగళవారం నాడు ఒక్కరోజే ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన రోగుల సంఖ్య 64కి చేరుకొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఏడాది సెప్టెంబర్ 5వ తేదీ నుండి స్కూల్స్ ప్రారంభించాలని భావిస్తోంది. ఆ సమయంలో రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిస్థితులకు అనుగుణంగా స్కూల్స్ తెరిచే విషయమై నిర్ణయం తీసుకొంటామని విద్యాశాఖ మంత్రి సురేష్ తెలిపారు.