రూ.50లక్షలు విలువచేసే డైమండ్ లభ్యం

Published : Jul 22, 2020, 10:40 AM IST
రూ.50లక్షలు విలువచేసే డైమండ్ లభ్యం

సారాంశం

వజ్రం విలువ రూ.50లక్షలు ఉంటుందని జిల్లా డైమండ్ ఆఫీసర్ ఆర్కే పాండే చెప్పారు. రాణిపూర్ ప్రాంతంలోని భూమికి అనందిలాల్ కుష్వాహకు పట్టా ఇచ్చారు.   

ఓ వ్యక్తి లీజుకి తీసుకొని మైనింగ్ పనులు నిర్వహిస్తుండగా ఓ అరుదైన వజ్రం దొరికింది. దాని బరువు దాదాపు 11 క్యారెట్లు ఉందని అధికారులు చెప్పారు. కాగా.. దాని విలువ దాదాపు రూ.50లక్షలు ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లాలోని రాణిపుర గనిలో వజ్రాల కోసం తవ్విన ఆనందిలాల్ కుష్వాహ అనే వ్యక్తి కు 10.69 కేరట్ల వజ్రం లభించింది. కుష్వాహకు లభించిన వజ్రం విలువ రూ.50లక్షలు ఉంటుందని జిల్లా డైమండ్ ఆఫీసర్ ఆర్కే పాండే చెప్పారు. రాణిపూర్ ప్రాంతంలోని భూమికి అనందిలాల్ కుష్వాహకు పట్టా ఇచ్చారు. 

అంతకు ముందు కుష్వాహకు ఒక వజ్రం లభించింది. లాక్ డౌన్ సమయంలో రెండు వజ్రాలు దొరికాయని అధికారులు చెప్పారు. తనకు రెండు వజ్రాలు లభించడంతో సంతోషంగా ఉందని, తన తోటి కార్మికులతో కలిసి వజ్రాల వేట కొనసాగిస్తానని కుష్వాహ చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌