Coronavirus in india: భారత్‌లో కరోనా కలకలం.. ఒక్క రోజే 2.68 లక్షల మందికి కరోనా..

By Sumanth KanukulaFirst Published Jan 15, 2022, 10:15 AM IST
Highlights

భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,68,833 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,68,50,962కి చేరింది. 


భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,68,833 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,68,50,962కి చేరింది. తాజాగా దేశంలో కరోనాతో 402 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 4,85,752కి చేరింది. గత 24 గంటల్లో 1,22,684 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,49,47,390కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో  14,17,820 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం బులిటెన్ విడుదల చేసింది.

ఇక, దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 16.66 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు.. 94.83 శాతం, యాక్టివ్ కేసుల రేటు.. 3.85 శాతంగా ఉంది. ఇక, శుక్రవారం (జనవరి 14) రోజున దేశంలో 16,13,740 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ వెల్లడించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 70,07,12,824కి చేరినట్టుగా తెలిపింది. 

మరోవైపు కరోనా కట్టడికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. శుక్రవారం రోజున 58,02,976 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. దీంతో దేశంలో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,56,02,51,117కి చేరింది. ఇక, దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. దేశంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6,041కి చేరింది. 

click me!