హోం ఐసోలేషన్ విధానంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా సవరణలు చేసింది. ఈ సవరించిన మార్గదర్శకాలను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. దీనిలో కోవిడ్ -19 రోగులు హోం ఐసోలేషన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది.
కరోనా వైరస్ (corona virus) కేసులు దేశంలో పెరుగుతున్నాయి. రోజుకు లక్షన్నరపైనే కేసులు నమోదువుతున్నాయి. కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. నైట్ కర్ఫ్యూ (night curfew), వీకెండ్ కర్ఫ్యూలు (weekend curfew) అమలు చేస్తున్నాయి. ఇతర ఆంక్షలను విధిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కోవిడ్ -19 (covid-19) ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో.. ప్రైవేట్ ఆఫీసులన్నీ వర్క్ ఫ్రం హోం విధానంలో ఉద్యోగులతో పనులు నిర్వహించుకోవాలని ఢిల్లీ డిజాస్గర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ddma) మూడు రోజుల కిందట ఆదేశాలు జారీ చేసింది. అలాగే తమిళనాడు రాష్ట్రంలో జనవరి 18వ తేదీ వరకు ప్రార్థనాలయాల్లో భక్తులకు ప్రవేశం నిషేదించారు.
ఓ వైపు కోవిడ్ నియంత్రణ కోసం చర్యలు తీసుకుంటూనే.. వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే దేశ ప్రజలకు 150 కోట్ల కోవిడ్ వ్యాక్సినేషన్ డోసులు అందాయి. అలాగే కొన్ని రోజుల టీనేజర్ల కోసం ప్రారంభించిన వ్యాక్సినేషన్ డ్రైవ్ (vaccination drive) కూడా వేగంగా సాగుతోంది. శుక్రవారం నాటి వివరాల ప్రకారం అర్హులైన టీనేజర్లలో 3.4 కోట్ల మందికి మొదటి డోసు వ్యాక్సిన్ అందింది. అలాగే వృద్ధులు, కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం చేపడుతున్న ప్రికాషనరీ డోసుకు కూడా మంచి స్పందన లభిస్తోంది.
undefined
కరోనా ట్రీట్ మెంట్ లో ప్రముఖ పాత్ర పోషించే హోం ఐసోలేషన్ (home isolation) విధానంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా సవరణలు చేసింది. ఈ సవరించిన మార్గదర్శకాలను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ -19 సోకిన వారిలో మైల్డ్ (స్వల్ప) అసింప్టోమాటిక్ (లక్షణాలు లేని) కేటగిరిలీగా వర్గీకరిస్తారు. వీరు మాత్రమే హోం ఐసోలేషన్ లో ఉండేందుకు అర్హులు. 60 ఏళ్లు పైబడిన రోగులు, ఇతర ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులు వైద్యుల అబ్జర్వేషన్ తరువాత మాత్రమే హోం ఐసోలేషన్ కు అనుమతి ఉంటుంది.
ఈ తాజా మార్గదర్శకాల ప్రకారం.. పాజిటివ్ గా (possitive) తేలిన 7 రోజుల తరువాత వరుసగా 3 రోజుల పాటు జ్వరం రాకపోతే హోం ఐసోలేషన్ ను ముగించవచ్చు. ఆ తరువాత ఎలాంటి టెస్ట్ అవసరం లేదు. అయితే లక్షణాలు లేకపోతేనే ఈ రూల్ వర్తిస్తుంది. కోవిడ్ సోకిన వారితో కాంటాక్ట్ అయిన వారిలో ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోతే పరీక్షలు నిర్వహించుకోవాల్సిన అవసరం లేదని, అయితే క్వారంటైన్ లో ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కోవిడ్ -19 ఇతర వేరియంట్లతో పోలిస్తే కొత్త వేరియంట్ (veriants) ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ (prime minister modi) అన్నారు. శుక్రవారం ఆయన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, అధికారులతో వర్చవల్ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. “మునుపటి వేరియంట్‌లతో పోలిస్తే ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. ఇది మరింత వ్యాప్తి చెందుతుందని ఆరోగ్య నిపుణులు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. మనం అప్రమత్తంగా ఉండాలి. కానీ ప్రజలు భయాందోళనలకు గురికాకుండా చూసుకోవాలి” అని ప్రధాని సూచించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ముందస్తు, సమిష్టి విధానమే ఈసారి కూడా విజయాన్ని చేకూర్చే మంత్రాలని అన్నారు.