భారత్‌లో కొనసాగుతున్న కరోనా కలకలం.. స్వల్పంగా తగ్గిన కొత్త కేసులు..

Published : Jan 11, 2022, 09:32 AM IST
భారత్‌లో కొనసాగుతున్న కరోనా కలకలం.. స్వల్పంగా తగ్గిన కొత్త కేసులు..

సారాంశం

భారత్‌లో కరోనా వైరస్‌ (Coronavirus) కలకలం కొనసాగుతుంది. రోజువారి కేసుల సంఖ్య భారీగా నమోదవుతుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,68,063 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి భారత్‌తో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,58,75,790కి చేరింది. 

భారత్‌లో కరోనా వైరస్‌ (Coronavirus) కలకలం కొనసాగుతుంది. రోజువారి కేసుల సంఖ్య భారీగా నమోదవుతుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,68,063 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి భారత్‌తో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,58,75,790కి చేరింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union Health Ministry) బులిటెన్ విడుదల చేసింది. అయితే తాజాగా నమోదైన కేసులు కిందటి రోజు నమోదైన కేసుల సంఖ్య (1,79,723) కంటే 6.5 శాతం తక్కువగా ఉన్నాయి. ఇక, గత 24 గంటల్లో కరనాతో 277 మంది మృతిచెందారు. 

దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,84,213కి చేరింది. తాజాగా కరోనా నుంచి 69,959 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,45,70,131కి చేరింది. ప్రస్తుతం దేశంలో 8,21,446 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రోజువారి పాటిజివిటీ రేటు 10.64 శాతంగా ఉంది. 

కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 33,470, పశ్చిమ బెంగాల్‌లో 19,286, ఢిల్లీలో 19,166, తమిళనాడులో 13,990, కర్ణాటకలో 11,698 కేసులు నమోదయ్యాయి. ఇక, దేశంలో నిన్న 15,79,928 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటివరకు భారత్‌లో మొత్తంగా 69,31,55,280 శాంపిల్స్‌కు పరీక్షించినట్టుగా పేర్కొంది. 

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. దేశంలో నిన్న 92,07,700 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,52,89,70,294కు చేరింది. 

మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 4,461 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Modi in Bodo Cultural Programme: బోడో సాంస్కృతిక కార్యక్రమంలో ప్రధాని మోదీ| Asianet News Telugu
Liquor sales: మందుబాబుల‌కు షాకింగ్ న్యూస్‌.. 28 రోజుల పాటు వైన్స్ షాపులు బంద్‌. కార‌ణం ఏంటంటే.?