తిరిగి విధుల్లోకి ‘మీసాల’ పోలీస్.. సస్పెన్షన్ ఎత్తివేత.. ఆ అధికారం అతనికి లేదు...

By SumaBala BukkaFirst Published Jan 11, 2022, 9:32 AM IST
Highlights

తాజా నిర్ణయంతో రాకేష్ రాణా తిరిగి పోలీస్ డిపార్ట్మెంట్లో మోటార్ వెహికల్ విభాగంలో డ్రైవర్గా చేరనున్నారు. భారీగా మీసాలు పెంచి, వాటిని ట్రిమ్ చేయడానికి నిరాకరించాడనే కారణంతో కానిస్టేబుల్ రాణాపై సస్పెన్షన్ వేటు పడింది. ‘పోలీసు శాఖలో ఇలాంటి వైఖరిని ప్రోత్సహించం. మీసాన్ని 
మెడ వరకూ పెంచాడు. 

భూపాల్ :  భారీ మీసాలతో డ్యూటీ కి హాజరై సస్పెన్షన్ కు గురైన Madhya Pradeshకు చెందిన Police Constableను ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకుంది. కానిస్టేబుల్ Rakesh Ranaను మళ్ళీ వీధుల్లోకి తీసుకున్నట్లు సోమవారం అధికారులు వెల్లడించారు. రాణాపై Suspensionవేటు వేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ఏఐజి ప్రశాంత్ వర్మకు అతన్ని తప్పించి అధికారం లేదని లేఖలో పేర్కొన్నారు. అందుకే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్లు వివరించారు. 

తాజా నిర్ణయంతో రాకేష్ రాణా తిరిగి పోలీస్ డిపార్ట్మెంట్లో మోటార్ వెహికల్ విభాగంలో డ్రైవర్గా చేరనున్నారు. భారీగా మీసాలు పెంచి, వాటిని ట్రిమ్ చేయడానికి నిరాకరించాడనే కారణంతో కానిస్టేబుల్ రాణాపై సస్పెన్షన్ వేటు పడింది. ‘పోలీసు శాఖలో ఇలాంటి వైఖరిని ప్రోత్సహించం. మీసాన్ని 
మెడ వరకూ పెంచాడు. వాటిని ట్రిమ్ చేయకుండా వస్తే.. అక్కడ పనిచేసే సిబ్బంది పైనా అతని ప్రభావం పడేలా ఉంది. అందుకే విధుల నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చింది’ అని అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ జనరల్ ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు.

దీనిపై రాణా స్పందిస్తూ.. ఉద్యోగ పరంగా ఎలాంటి ఫిర్యాదులూ లేవని తెలిపారు మీసాలు ఉండటమే తనకు గర్వకారణం అన్నారు. దానికోసం సస్పెండ్ అయినా పర్వాలేదని.. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కరాఖండిగా తేల్చి చెప్పాడు 

ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పోలీసు తన మీసం కట్టు ఒక ఆత్మాభిమాన సంకేతంగా భావిస్తుంటాడు. అంతేకాదు, అదే తనకు గర్వకారణమనిచెప్పుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన మీసాన్ని తగ్గించేదే లేదని తీర్మానించుకున్నాడు. తనపై సస్పెన్షన్ వేటు వేస్తామన్న తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

మధ్యప్రదేశక్‌కు చెందిన రాకేశ్ రానా కానిస్టేబుల్. రాష్ట్ర పోలీసుల రవాణా విభాగంలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన మీసాలు గదవ దాటి మెడ వరకు పెంచుకున్నాడు. అవి కొంత ఎబ్బెట్టుగానూ మరికొంత అందవికారంగానూ ఉన్నాయి. ఆ మీసాలు పోలీసుల పట్ల తప్పుడు సందేశాన్ని పంపే అవకాశం ఉన్నదని పై అధికారులు భావించారు. తోటి ఉద్యోగులకూ ఆయనపై నెగెటివ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉందని యోచించారు. 

అందుకే తన మీసాలను కత్తిరించుకోవాల్సిందిగా కానిస్టేబుల్ రాకేశ్ రానాను ఆదేశించారు. కానీ, ఆయన అందుకు ససేమిరా అన్నాడు. తాను తన మీసాలను కత్తింరించే ఛాన్సే లేదని స్పష్టం చేశాడు. ఆ మీసాలు తనకు ఆత్మాభిమాన సంకేతాలు అని తెలిపాడు. పై అధికారులు ఎన్ని సార్లు కత్తిరించాలని సూచించినా.. ఆయన వాటిని ఖాతరు చేయలేదు. తాను రాజ్‌పుత్ అని.. తన మీసాలే.. తనకు గర్వకారణమని డిక్లేర్ చేశాడు.

దీంతో పై అధికారులు ఆయనపై సస్పెన్షన్ వేట వేశారు. ఆయన అప్పియరెన్స్ గురించి పై అధికారుల ఆదేశాలను శిరసావహించలేదని పేర్కొంటూ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ప్రశాంత్ శర్మ కానిస్టేబుల్ రాకేశ్ రానాను సస్పెండ్ చేస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. కానిస్టేబుల్ రానా అప్పియరెన్స్ చూస్తే.. ఆయన తన జుట్టును పెద్దగా పెంచుకున్నాడని, మీసాలను మెడ వరకు పెంచుకుంటున్నాడని పేర్కొన్నారు. మీసాలు ఒక కానిస్టేబుల్‌గా సరైన రూపాన్ని చూపడం లేదని, వాటిని కత్తిరించాల్సిందిగా అధికారులు పలు సార్లు ఆదేశించారని, కానీ, కానిస్టేబుల్ రాకేశ్ రానా ఆ ఆదేశాలను బేఖాతరు చేశారని పేర్కొన్నారు. 

రాకేశ్ రానా తన యూనిఫామ్‌ను అన్ని విధాల్లో సరిగ్గా మెయింటెయిన్ చేశాడని, కానీ, సస్పెన్షన్ వేటు విధించినా ఆయన తన మీసాలను కత్తిరించడంపై రాజీ పడలేదని వివరించారు. చాలా కాలంగా ఆయన తన మీసాలను అలా మెడ వరకు పెంచుకుని మెయింటెయిన్ చేస్తున్నాడని తెలిపారు.

click me!