ఇండియాలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు: నిన్నటి కంటే 14 శాతం కేసుల పెరుగుదల

By narsimha lodeFirst Published Nov 11, 2021, 10:46 AM IST
Highlights

రెండు రోజులుగా ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నిన్నటితో పోలిస్తే 14 శాతం కరోనా కేసుల్లో పెరుగుదల నమోదైంది. అంతకు ముందు రోజుతో నిన్న 13 శాతం కరోనా కేసుల్లో పెరుగుదల నమోదైంది. నిన్నటితో పోలిస్తే కరోనా మృతుల సంఖ్య తగ్గింది.

న్యూఢిల్లీ: Indiaలో గత 24 గంటల్లో 13,091 కొత్త Corona కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 34,401,670 కోట్లకి చేరింది.మరో వైపు కరోనాతో 340 మంది చనిపోయారు.నిన్న ఒక్క రోజే 11,89,470 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నిన్నటితో పోలిస్తే కరోనా కేసుల  14 శాతం ఎక్కువగా నమోదయ్యాయి.నిన్న ఒక్క రోజే కరోనా నుండి 13,878 మంది కోలుకున్నారు. ఇప్పటివకు కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 3,38,00,925కి చేరింది. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,38,556 లక్షలకు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా యాక్టివ్ కేసులు 0.40 శాతానికి పడిపోయినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా రోగుల రికవరీ రేటు 98.25 గా రికార్డైంది. కరోనా యాక్టివ్ కేసులు 266 రోజుల్లో అత్యల్పంగా నమోదైంది.  ఈ ఏడాది మార్చి తర్వాత కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య తక్కువగా రికార్డైందని వైద్య ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు

also read:24 గంటల్లో 106 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,72,052కి చేరిన మొత్తం కరోనా కేసులు

వారాంతపు కరోనా పాజిటివిటీ రేటు 1.18 శాతంగా నమోదైంది.  వీక్లి కరోనా పాజిటివిటీ రేటు 48 రోజులుగా 2 శాతానికి తక్కువగా నమోదౌతుంది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 1.10 శాతంగా రికార్డైంది. 37 రోజులుగా 2 శాతం కంటే రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి.దేశంలో corona తో మరణించిన వారి సంఖ్య 4.62,189 లక్షలకు చేరుకొంది. 

india లో 2020 ఆగష్టు 7న 20 లక్షలు, ఆగష్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు,సెప్టెంబర్ 16న 50 లక్షలకు కరోనా కేసులు చేరాయి. సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షల కేసులు దాటాయి.డిసెంబర్ 19న కోటి కేసులను దాటాయి.ఈ ఏడాది మే 4న  రెండు కోట్ల కేసులను దాటాయి.ఈ ఏడాది జూన్ 23న కరోనా కేసులు మూడు కోట్లను దాటాయి.గత 24 గంటల్లో 57 లక్షల Corona Vaccineడోసుల పంపిణీ జరిగింది.ఇప్పటివరకు 110 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

గత 24 గంటల్లో 57 లక్షల వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది.ఇప్పటివరకు 110 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. యూపీ రాష్ట్రంలో 13.53 బిలియన్లకు పైగా కరోనా వ్యాక్సిన్ అందించినట్టుగా యూపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. రాష్ట్రంలోని 68 శాతం మంది వ్యాక్సిన్ కు అర్హత ఉన్న వాిరలో ఒక డోస్ ను తీసుకొన్నారని యూపీ ప్రభుత్వం తెలిపింది.ఢిల్లీ ప్రభుత్వం దేశ రాజధానిలోని భజన్‌పురాలోన గావడి ప్రాంతంలోని ఛత్‌పూజ ఘా్ సమీపంలో భక్తుల కోసం కరోనా వ్యాక్సిన్ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టుగా ప్రభుత్వం వివరించింది.నిన్న ఒక్క రోజు మిజోరం లో 531 కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 1,26,917కి చేరుకొన్నాయి. కర్ణాటకలో 531 కేసులు నమోదయ్యాయి.

click me!