దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

Published : Aug 09, 2022, 10:27 AM IST
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

సారాంశం

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 12,751 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. 

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 12,751 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. అయితే కిందటి రోజుతో (16,167  కేసులు) పోలిస్తే కొత్త కేసుల సంఖ్య 21 శాతం తగ్గింది. తాజా కేసులో దేశంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4,41,74,650కి పెరిగింది. తాజాగా కరోనాతో 42 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,26,772కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో దేశంలో 16,412 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,35,16,071 కి పెరిగింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,31,807కి తగ్గింది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ రికవరీ రేటు 98.51 శాతంగా నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేట్ 3.50 శాతంగా, విక్లీ పాజిటివిటీ రేట్ 4.69 శాతంగా ఉంది. 

మరోవైపు దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 31,95,034 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో దేశంలో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,06,88,49,775కి పెరిగింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు