‘అమ్మా-నాన్న క్షమించండి’.. సూసైడ్ నోట్ రాసి టెకీ ఆత్మహత్య...

Published : Aug 09, 2022, 10:07 AM IST
‘అమ్మా-నాన్న క్షమించండి’.. సూసైడ్ నోట్ రాసి టెకీ ఆత్మహత్య...

సారాంశం

సూసైడ్ నోట్ రాసి ఓ యువ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన పూణేలో వెలుగు చూసింది. ఆ లెటర్ లో తల్లిదండ్రులను క్షమించమని కోరాడు. తానో అమ్మాయిని ప్రేమించానని చెప్పుకొచ్చాడు. 

భోపాల్ : పూణేకు చెందిన 23 ఏళ్ల యువ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బాగ్ సెవానియా ప్రాంతంలోని తన అద్దె ఫ్లాట్‌లో ఆదివారం విషం మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో తాను ఇంత దారుణమైన నిర్ణయం తీసుకున్నందుకు తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాడు. దీంతోపాటు సూసైడ్ నోట్‌లో ఒక అమ్మాయిని తాను గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చాడు. అయితే ఆ అమ్మాయి పేరు అందులో రాయలేదు. 

తన సోదరిని జాగ్రత్తగా చూసుకోవాలని కూడా తల్లిదండ్రులను అభ్యర్థించాడు.కాగా సదరు ఇంజనీర్ కొంతకాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, ఆమె పేరును ఛాతీపై టాటూ వేయించుకున్నాడన్న విషయం అతని మరణం నేపథ్యంలో వెలుగులోకి వచ్చింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ, కొన్ని కారణాల వల్ల అతని కల నెరవేరలేదని పోలీసులు తెలిపారు. మంద్‌సౌర్‌కు చెందిన మృతుడు నవీన్ మాల్వియా బాగ్-సెవానియాలోని సాకేత్ నగర్‌లోని ఓ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నాడని దర్యాప్తు అధికారి ఏఎస్‌ఐ రామ్‌దేని రాయ్ తెలిపారు. 

దారుణం.. రైలు ఎక్కిస్తాన‌ని న‌మ్మించి మైన‌ర్ పై అత్యాచారం.. ఇద్దరు అరెస్టు..

ఇటీవలే బీటెక్ పూర్తి చేసి పూణెలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. ఆదివారం, అతను అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లో విషం తాగాడు. అతని పరిస్థితి విషమంగా ఉండడాన్ని గమనించిన అతని స్నేహితులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదు చేసినట్లు బాగ్ సెవానియా పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families