Corona cases in India 17 నెలల కనిష్టానికి ఇండియాలో కరోనా యాక్టివ్ కేసులు

By narsimha lodeFirst Published Nov 14, 2021, 11:20 AM IST
Highlights


ఇండియాలో  కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి.  నిన్న ఒక్క రోజే 11,271 కొత్త కేసులు నమోదయ్యాయి.కేరళ రాష్ట్రంలో 6,468  కేసులు రికార్డయ్యాయి. మరో వైపు కేరళ రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య తగ్గిపోయింది.

న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో  11,271 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 17 మాసాల్లో ఇంత తక్కువ కరోనా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నారు.దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 6,468 కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. మరో వైపు కేరళ రాష్ట్రంలో కరోనాతో నిన్న ఒక్క రోజు 23 మంది మరణించారు. కరోనా మృతుల సంఖ్య కేరళ రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోయింది.మరో వైపు కరోనాతో 285 మంది చనిపోయారు.నిన్న ఒక్క రోజే కరోనా నుండి 13,155 మంది కోలుకున్నారు. దేశంలో కరోనాతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,63,530కి చేరుకొంది.

గత 24 గంటల్లో Corona నుండి   11,376 మంది కోలుకొన్నారు. దీంతో Indiaలో కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 3,38,37,859 కి చేరింది. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,918 లక్షలకు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా యాక్టివ్ కేసులు  522 రోజుల కనిష్టానికి పడిపోయాయని Icmr ప్రకటించింది. కరోనా యాక్టివ్ కేసులు మొత్తం 1 శాతం కంటే తక్కువగా నమోదయ్యాయి.  ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 0.39 శాతంగా నమోదైనట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 2020  మార్చి తర్వాత ఇదే అత్యల్పంగా  అధికారులు తెలిపారు.267 రోజుల కనిష్టానికి కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య చేరుకొందని అధికారులు తెలిపారు. కరోనా రోగుల రికవరీ రేటు 98.26 గా రికార్డైంది. కరోనా రోగుల రికవరీ రేటు ఈ ఏడాది మార్చి తర్వాత అత్యధికమని ఐసీఎంఆర్ ప్రకటించింది.

also read:ఏపీ: 24 గంటల్లో 156 మందికి పాజిటివ్.. 20,66,875కి చేరిన సంఖ్య, తూర్పుగోదావరిలో అత్యధికం

వారాంతపు కరోనా పాజిటివిటీ రేటు 1.01 శాతంగా నమోదైంది.  వీక్లి కరోనా పాజిటివిటీ రేటు 51రోజులుగా 2 శాతానికి తక్కువగా నమోదౌతుంది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 0.90 శాతంగా రికార్డైంది. 41 రోజులుగా 2 శాతం కంటే రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి. ఇండియాలో 2020 ఆగష్టు 7న 20 లక్షలు, ఆగష్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు,సెప్టెంబర్ 16న 50 లక్షలకు కరోనా కేసులు చేరాయి. సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షల కేసులు దాటాయి.డిసెంబర్ 19న కోటి కేసులను దాటాయి.ఈ ఏడాది మే 4న  రెండు కోట్ల కేసులను దాటాయి.ఈ ఏడాది జూన్ 23న కరోనా కేసులు మూడు కోట్లను దాటాయి

.గత 24 గంటల్లో 57,43,840 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నారు. ఇప్పటి వరకు ఇండియాలో 112 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నారని  ఐసీఎంఆర్ ప్రకటించింది. మరో వైపు మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం నాడు మహారాష్ట్రలో 999 కరోనా కేసులు రికార్డయ్యాయి. గరువారం నాడు 41 మంది, శుక్రవారం నాడు 28 మంది కరోనాతో మరణించారు  ఇదిలా ఉంటే దేశంలో ఇప్పటివరకు 62.37 కోట్ల మందికి కరోనా నిర్ఱారణ పరీక్షలు నిర్వహించారు.మరో వైపు మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం నాడు మహారాష్ట్రలో 999 కరోనా కేసులు రికార్డయ్యాయి. గరువారం నాడు 41 మంది, శుక్రవారం నాడు 28 మంది కరోనాతో మరణించారు 

click me!