Coronavirus in India: భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఒక్క రోజే 2.86 లక్షల కేసులు..

By Sumanth KanukulaFirst Published Jan 27, 2022, 9:52 AM IST
Highlights

భారత్‌లో కరోనా వైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు నమోదయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య కొద్దిగా పెరిగింది. 

భారత్‌లో కరోనా వైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు నమోదయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య కొద్దిగా పెరిగింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,03,71,500కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనాతో 573 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల (Corona deaths) సంఖ్య 4,91,700కి చేరింది. తాజాగా కరోనా నుంచి 3,06,357 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనాను జయించిన వారి సంఖ్య 3,76,77,328కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 22,02,472 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

మరోవైపు దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 19.59 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేట్ 17.75 శాతంగా ఉంది. ఇక, దేశంలో కరోనా రికవరీ రేటు 93.33 శాతం, యాక్టివ్ కేసులు.. 5.46 శాతం, మరణాలు.. 1.22 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

దేశంలో నిన్న(జనవరి 26) 14,62,261 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 72,21,66,248 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా తెలిపింది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 22,35,267 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,63,84,39,207కి చేరింది. 

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా నమోదవతున్నాయి. కేరళ, కర్ణాటకలో భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేరళలో బుధవారం 49,771 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కేరళలో 3,00,556 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక, కర్ణాటకలో బుధవారం 48,905 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 36,54,413కు పెరిగింది. తాజాగా కరోనాతో 39 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 38,705 కు చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులెటిన్‌ను విడుదల చేసింది.

click me!