గూగుల్‌లో సెర్చ్‌ చేసి వ్యక్తి గొంతు నులిమి హత్య.. శవాన్ని మూటగట్టి, నదిలో పారేసి.. నగదు దోపిడీ...

By SumaBala BukkaFirst Published Jan 27, 2022, 9:03 AM IST
Highlights

పుట్టేనహళ్లి పోలీసుల కథనం మేరకు.. బసశంకరి సరబండెపాళ్య నివాసి దివాకర్ ఎస్ఎస్ఆర్ గోల్డ్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ప్రజల వద్ద బంగారు నగలు డిపాజిట్ చేయించుకుని రుణాలు ఇచ్చేవాడు. ఇదిలా ఉండగా తుమకూరుకు చెందిన మంజునాథ్, మునిరాజులు దోపిడీ కోసం ప్లాన్ వేశారు. దీనికోసం గూగుల్ లో గాలించి  ఎస్ఎస్ఆర్ గోల్డ్ కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్ కు ఫోన్ చేసి దివాకర్ నెంబర్ తీసుకున్నారు.
 

కర్ణాటక : Karnatakaలో దుండగులు తెగబడ్డారు. Googleలోసెర్చ్ చేసి.. ఏకంగా ఓ మనిషిని చంపేసి డబ్బుతో ఉడాయించారు. గూగుల్ లో 
Search చేసి..Gold Company ఉద్యోగుల నగదు ఉంటుందని గుర్తించి..వల వేశారు. బంగారం అమ్ముతామని చెప్పి ఆ కంపెనీ ఉద్యోగిని రప్పించి.. murder చేసి.. dead bodyని చెరువులో పడేసి నగదుతో ఉడాయించారు. 
Call data ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి arrest చేశారు. 

వివరాల్లోకి వెళితే..  పుట్టేనహళ్లి పోలీసుల కథనం మేరకు.. బసశంకరి సరబండెపాళ్య నివాసి దివాకర్ ఎస్ఎస్ఆర్ గోల్డ్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ప్రజల వద్ద బంగారు నగలు డిపాజిట్ చేయించుకుని రుణాలు ఇచ్చేవాడు. ఇదిలా ఉండగా తుమకూరుకు చెందిన మంజునాథ్, మునిరాజులు దోపిడీ కోసం ప్లాన్ వేశారు. దీనికోసం గూగుల్ లో గాలించి  ఎస్ఎస్ఆర్ గోల్డ్ కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్ కు ఫోన్ చేసి దివాకర్ నెంబర్ తీసుకున్నారు.

ఈనెల 19న దివాకర్ కుఫోన్ చేశారు. డబ్బు అవసరం ఉందని..  65.70 గ్రాముల  బంగారు ఆభరణాలు విక్రయిస్తామని చెప్పి సుందనకట్టెకు ఈనెల 20న రప్పించి అతని వద్ద ఉన్న రూ. ఐదు లక్షలు లాక్కొని .. తర్వాత అతని గొంతు నులిమి హత్య చేసి.. శవాన్ని మూటగట్టి అతను వచ్చిన బైక్ తో సహా  మాగడి రోడ్డు హొన్నాపుర చెరువులో పడేశారు. దివాకర్ అదృశ్యంపై లక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులు అతని ఫోన్ కు వచ్చిన నెంబర్లను పరిశీలించి నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. బుధవారం దివాకర్ మృతదేహాన్ని వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. 

కాగా, యూ ట్యూబ్ లో చూసి నేరాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి. ఇలాంటి ఘటనే నిరుడు సెప్టెంబర్ లో ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలో సోమవారం రాత్రి ఓ బాలిక (13), యూట్యూబ్ లో ఓ వీడియో చూసి.. తానూ అలాగే బ్లేడుతో పీక కోసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

అంబాజీపేటకు చెందిన ఓ మహిళ విజయవాడలో భర్తతో కలిసి ఉండేది. ఏడాది క్రితం భర్త కోవిడ్ తో మృతి చెందగా, అబ్బాయి, అమ్మాయితో కలిసి అంబాజీపేట వచ్చి పుట్టింట్లో ఉంటోంది. అయితే, ఆమె తమ్ముళ్లు, భార్యల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు వీరి పోషణ విషయంలో కాదు. కానీ, ఈ గొడవలతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. యూ ట్యూబ్ లో బ్లేడ్ తో పీక కోసుకుని చనిపోవడం ఎలా? అనే వీడియో చూసింది. 

బ్లేడ్, చాకుతో పీక కోసుకుంటే చనిపోతారా.. అని తల్లిని అడగడంతో ఆమె మందలించింది. ఈ క్రమంలో ఆ రోజు రాత్రి భోజనం అనంతరం బాలిక బాత్ రూమ్ కు వెళ్లి బ్లేడ్ తో పీక కోసుకుని గట్టిగా కేకలు వేసింది. కుటుంబ సభ్యులు వెంటనే చూసి అమలాపురం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక అదే రోజు రాత్రి 11 గంటలకు మృతి చెందింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

click me!