దేశంలో కరోనా వైరస్ కేసులు 4.90 లక్షలను దాటాయి. గత 24 గంటల్లో 17 వేల కరోనా కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు 15,301 మంది కరోనాతో మరణించారు.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు 4.90 లక్షలను దాటాయి. గత 24 గంటల్లో 17 వేల కరోనా కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు 15,301 మంది కరోనాతో మరణించారు.
24 గంటల్లో దేశ వ్యాప్తంగా 17,296 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు 407 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 4,90,401కి చేరుకొన్నాయి. వీటిలో 1,89,463 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా సోకినవారిలో 2,85,637 మంది కోలుకొన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
undefined
మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో 1.47 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు సుమారు 7 వేల మంది మరణించారు. ఇక ఢిల్లీ రాష్ట్రంలో 73 వేల మందికి కరోనా సోకింది. సుమారు 2400 మంది మరణించారు.
ఇక తమిళనాడు రాష్ట్రంలో 71వేల కేసులు రికార్డయ్యాయి.తమిళనాడు తర్వాతి స్థానంలో గుజరాత్ రాష్ట్రం నిలిచింది.గుజరాత్ రాష్ట్రంలో 30వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కరోనాతో ఈ రాష్ట్రంలో 1700 మరణించారు.
బీహార్ రాష్ట్రంలో8473 కేసులు నమోదయ్యాయి. జమ్మూ కాశ్మీర్ లో 6549 కేసులు, అస్సాంలో6321, ఒడిశాలో 5962, పంజాబ్ లో 4769 కేసులు, కేరళలో 3,726, ఉత్తరాఖండ్ లో2,691 కేసులు, ఛత్తీస్ ఘడ్ లో 2,452, జార్ఖండ్ లో 2,262 కేసులు నమోదైనట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.గత 24 గంటల్లో దేశంలో 2,15,446 శాంపిల్స్ పరీక్షిస్తే 17,296కి కరోనా సోకినట్టుగా తేలిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.