ఇండియాలో కరోనా తగ్గుముఖం: పెరిగిన రికవరీ

By narsimha lodeFirst Published Jul 16, 2021, 9:53 AM IST
Highlights

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ముందు రోజుతో పోలిస్తే కరోనా కేసులు తగ్గాయి. గత 24 గంటల్లో 38,549 కరోనా కేసులు నమోదయ్యాయి. 

న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో నిన్న ఒక్క రోజు 19,55,910 మంది శాంపిల్స్ సేకరిస్తే  38,549 కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్రం తెలిపింది. ముందు రోజుతో పోలిస్తే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. నిన్న ఒక్క రోజులోనే కరోనాతో 542 మంది మరణించారు. గత 24 గంటల్లోనే  కరోనా నుండి 40,026 మంది కోలుకొన్నారు.

 కరోనా రోగుల రికవరీ రేటు 97.28 శాతానికి చేరుకొంది. యాక్టివ్ కేసుల సంఖ్య 1.39 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.వారాంతపు కరోనా పాజిటివిటీ రేటు 5 శాతంలోపుగా నమోదైంది.దేశంలో కరోనా నుండి ఇప్పటివరకు  3,01,83,876 మంది కోలుకొన్నారు.ఇండియాలో కరోనా యాక్టివ్ కేసులు 4,30,422కి చేరుకొన్నాయి. కరోనాతో మరణించిన రోగుల సంఖ్య కూడ తగ్గుముఖం పట్టింది. జూన్ 10వ తేదీన కరోనాతో అత్యధికంగా 6 ,148 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు 39,53,43,767 మంది వ్యాక్సినేషన్ చేయించుకొన్నారు. కేరళలో కరోనా కేసులు పెరుగుతున్నందున ఆ రాష్ట్రం లాక్ డౌన్ వైపు మొగ్గు చూపింది. 

click me!