ఎనిమిదేళ్ల బాలికపై యువకుడి అఘాయిత్యం

Published : Jul 16, 2021, 09:09 AM ISTUpdated : Jul 16, 2021, 09:10 AM IST
ఎనిమిదేళ్ల బాలికపై యువకుడి అఘాయిత్యం

సారాంశం

ఈ క్రమంలో బాలికకు మాయ మాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి దాడికి పాల్పడ్డాడు. నిందితుడు కూలీ పనికి వెళ్తుంటాడు.

మైనర్ బాలికపై ఓ  యవకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పసిపిల్ల అనే కనికరం లేకుండా దారుణంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ముడో తరగతి చదువుతున్న బాలిక ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో ఆమెను వెతుక్కుంటూ కజిన్  వచ్చాడు. ఈ క్రమంలో బాలికకు మాయ మాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి దాడికి పాల్పడ్డాడు. నిందితుడు కూలీ పనికి వెళ్తుంటాడు.

లైంగిక దాడి అనంతరం ఇంటికి చేరిన బాధిత బాలికకు తీవ్ర రక్తస్రావమైనట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు బాలికను ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. అత్యాచారం జరిగినట్లు తేలింది. దీంతో  నిందితుడి అదుపులోకి తీసుకుని విచారించగా తాను చేసిన  నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. 

PREV
click me!

Recommended Stories

Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu
Digital Health : ఇక వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ... కీలక పరిణామాలు