భారత్, చైనా బలగాలు గాల్వాన్ లో తలపడ్డాయనేది అవాస్తవం: భారత సైన్యం

By team teluguFirst Published Jul 16, 2021, 8:21 AM IST
Highlights

గాల్వాన్ లోయలో భారత్ చైనా బలగాలు మధ్య మరోసారి ఘర్షణ జరిగిందన్న కథనం పూర్తిగా అవాస్తవమని భారత సైన్యం అధికారిక ప్రకటనలో తెలిపింది. 

గాల్వాన్ లోయలో భారత్ చైనా బలగాలు మధ్య మరోసారి ఘర్షణ జరిగిందన్న బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని భారత సైన్యం అధికారిక ప్రకటనలో తెలిపింది. చాలా చోట్ల ఎల్ఏసి ని ధాటి చైనా బృందాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయన్న వార్తను ఖండిస్తూ ఆర్మీ ఈ ప్రకటనను విడుదల చేసింది. 

సదరు పత్రికలో వచ్చిన వార్త తప్పుడు సమాచారంతో కూడుకొని ఉందని, భారత్ చైనాల మధ్య ఎటువంటి ఘర్షణ జరగలేదని, చైనాతో జరిగిన ఏ ఒప్పందం కూడా కొలాప్స్ అవ్వలేదని ప్రకటనలో తెలిపింది ఈ సంవత్సరం ఫిబ్రవరి లో జరిగిన డిస్ ఎంగేజ్మెంట్ ఒప్పందం తరువాత ఇరు పక్షాలు దానికి కట్టుబడి వ్యవహరించాయని ఆర్మీ పేర్కొంది. గాల్వాన్ లో కానీ, వేరే ఏ ప్రాంతంలో కానీ ఘర్షణలు జరగలేదని, సదరు రిపోర్టర్ తప్పుడు ఉద్ధేశయంతో ఈ కథనాన్ని రాసాడని, ఇది పూర్తిగా అవాస్తవమని సైన్యం తన ప్రకటనలో పేర్కొంది. 

భారత్, చైనాలు తమ మధ్య ఉన్న మరికొన్ని సమస్యల పరిష్కారానికి చర్చలు జరపడానికి అంగీకరించాయని ఈ సందర్భంగా తెలిపారు. సరిహద్దు ప్రాంతంలో రెగ్యులర్ గా పెట్రోలింగ్ జరుగుతూనే ఉందని ఆర్మీ పేర్కొంది. 

click me!