Omicron in India: భారత్‌లో 1,431కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. లక్ష దాటిన కరోనా యాక్టివ్ కేసులు

By Sumanth Kanukula  |  First Published Jan 1, 2022, 10:21 AM IST

ప్రపంచంలోని పలు దేశాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron)  విజృంభణ కొనసాగుతుంది. భారత్‌లో కూడా ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 1,431 ఒమిక్రాన్ కేసులు నమోదు అయినట్టుగా  కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం తెలిపింది.


ప్రపంచంలోని పలు దేశాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron)  విజృంభణ కొనసాగుతుంది. భారత్‌లో కూడా ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 1,431 ఒమిక్రాన్ కేసులు నమోదు అయినట్టుగా  కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం తెలిపింది. ఈ మేరకు బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు ఒమిక్రాన్‌ నుంచి 488 మంది కోలుకున్నారని తెలిపింది. ఇప్పటివరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యధికంగా 454 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 351 Omicron casesతో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. 

ఒమిక్రాన్ కేసుల జాబితా.. 
ఒమిక్రాన్ కేసుల విషయానికి వస్తే.. మహారాష్ట్రలో 454, ఢిల్లీలో 351, తమిళనాడులో 118, గుజరాత్‌లో 115, కేరళలో 109, రాజస్తాన్‌లో 69, తెలంగాణలో 62, హర్యానాలో 37, కర్ణాటకలో 34, ఆంధ్రప్రదేశ్‌లో 17, పశ్చిమ బెంగాల్‌లో 17, ఒడిశాలో 14, మధ్యప్రదేశ్‌లో 9, ఉత్తరప్రదేశ్‌లో 8, ఉత్తరాఖండ్‌లో 4, చంఢీఘర్‌లో 3, జమ్మూ కశ్మీర్‌లో 3, అండమాన్ నికోబార్ దీవుల్లో 2,  గోవాలో 1, హిమాచల్ ప్రదేశ్‌లో 1, లడఖ్‌లో 1, మణిపూర్‌లో 1, పంజాబ్‌లో 1 నమోదయ్యాయి. 

Latest Videos

undefined

కరోనా కేసులు.. 
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 22,775 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,48,61,579కి చేరింది. కరోనాతో తాజాగా మరో 406 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 4,81,486కి చేరింది. నిన్న దేశంలో కరోనా నుంచి 8,949 మంది కోలుకున్నార. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,42,75,312కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,04,781 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

మరోవైపు దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. శుక్రవారం దేశంలో 58,11,487 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,45,16,24,150కు చేరింది. 

click me!