ఎల్ఓసీ దాటేందుకు భారత్ సిద్ధంగా ఉంది.. ఆర్మీకి మద్దతు ఇవ్వడానికి పౌరులు సిద్ధంగా ఉండాలి - రాజ్ నాథ్ సింగ్

Published : Jul 26, 2023, 12:16 PM IST
ఎల్ఓసీ దాటేందుకు భారత్ సిద్ధంగా ఉంది.. ఆర్మీకి మద్దతు ఇవ్వడానికి పౌరులు సిద్ధంగా ఉండాలి - రాజ్ నాథ్ సింగ్

సారాంశం

నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) దాటడానికి భారత్ సిద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అలాంటి సందర్భంలో అవసరమైతే సైన్యానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. 

తన గౌరవాన్ని కాపాడుకోవడానికి నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) దాటడానికి భారత్ సిద్ధంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో సైనికులకు మద్దతు ఇవ్వడానికి పౌరులు సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉదాహరణగా చూపుతూ.. పౌరులు రంగంలోకి దిగి యుద్ధంలో పాల్గొంటున్నారని, అందుకే ఏడాదికి పైగా యుద్ధం కొనసాగుతోందని ఆయన అన్నారు.

ఈడీ, సీబీఐ, ఐటీలే ఎన్డీయేలో ఉన్న మూడు బలమైన పార్టీలు - ఉద్ధవ్ ఠాక్రే

24వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ఆయన మాట్లాడారు. అంతకు ముందు 1999 కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన జవాన్లకు ఆయన స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ‘‘మనకు పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచింది. యుద్ధం భారత్‌పై విధించబడింది. దేశానికి మొదటి స్థానం ఇచ్చి ప్రాణత్యాగం చేసిన మన వీర కుమారులకు నేను సెల్యూట్ చేస్తున్నాను’’ అని ఆయన అన్నారు.

యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడల్లా దేశ ప్రజలు బలగాలకు మద్దతిచ్చారని, కానీ ఆ మద్దతు పరోక్షంగా ఉందని రక్షణ శాఖ మంత్రి అన్నారు. అవసరమైతే నేరుగా యుద్ధభూమిలో సైనికులకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని తాను ప్రజలను కోరుతున్నానని అన్నారు. దేశ గౌరవాన్ని కాపాడేందుకు ఎంతవరకైనా వెళ్లగలమన్నారు. ఒకవేళ నియంత్రణ రేఖను దాటడమే దానికి నిదర్శనమైతే, తాము ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఆన్ లైన్ డేటింగ్ యాప్ లో పరిచయం.. మహిళను హోటల్ కు పిలిపించి అత్యాచారం..

1999లో లద్దాఖ్ లోని ముఖ్యమైన ప్రాంతాలను రహస్యంగా ఆక్రమించుకున్న పాక్ దళాలను తిప్పికొట్టేందుకు భారత సైన్యం భీకర ఎదురుదాడికి దిగింది. ఇందులో భారత్ గెలిచింది. ఇక అప్పటి నుంచి పాకిస్తాన్ పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటారు.

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu