
భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధం ముగిసిందని ట్రంప్ ప్రకటించారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలూ అంగీకారంచని తెలియారు.ఈ సందర్భంగా రెండు దేశాలకు ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించారు.
కాల్పలు విరమణను భారత్ కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ విషయాన్ని తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ప్రారంభమైనట్లు వివరించారు. కాల్పుల విరమణను ఇరు దేశాలు ధృవీకరించాయి. మధ్యాహ్నం 3.15 గంటలకు భారత డీజీఎంవోకి పాకిస్థాన్ డీజీఎంవోకి ఫోన్ చేసిందని తెలిపారు.
పాకిస్తాన్ మరియు భారత్ తక్షణం నుంచే కాల్పుల విరమణకు అంగీకరించాయని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ తెలిపారు. శాంతి, భద్రత కోసం పాకిస్తాన్ ఎప్పుడూ కృషి చేస్తోంది, అయితే తన సార్వభౌమాధికారం, భౌగోళిక సమగ్రతపై ఏమాత్రం రాజీ పడదని ట్వీట్ చేశారు.
భారతదేశం, పాకిస్తాన్ ఈరోజు కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలన్న అంశంపై ఓ అవగాహనకు వచ్చాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనైనా తీవ్రంగా వ్యతిరేకించే తన ధృఢమైన, రాజీ లేని వైఖరిని భారత్ ఎప్పుడూ పాటిస్తూ వచ్చిందన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగుతుందని తేల్చి చెప్పారు.