India Pakistan :ఈ 3 సైనిక స్థావరాలే టార్గెట్ గా పాక్ దాడులు  : భారత రక్షణ శాఖ 

Arun Kumar P | Updated : May 09 2025, 06:40 AM IST
India Pakistan :ఈ 3 సైనిక స్థావరాలే టార్గెట్ గా పాక్ దాడులు  : భారత రక్షణ శాఖ 

పాకిస్థాన్ మిస్సైల్స్, డ్రోన్లతో భారత్ పై జరిపిన దాడులపై రక్షణ శాఖ స్సందించింది. పాక్ ఏ ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని దాడులకు యత్నించింది... భారత సైన్యం వాటిని ఎలా తిప్పికొట్టింది వివరించారు. 

India Pakistan : భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. గురువారం రాత్రి ఇరుదేశాలు ఒకరిపై ఒకరు మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు, ప్రతిదాడులకు దిగారు. పాకిస్థాన్ యుద్దవిమానాలు భారత భూభాగంలోకి వచ్చి సైనిక స్థావరాలే, సామాన్య పౌరులే టార్గెట్ గా దాడులకు యత్నించింది. అయితే భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టం ఈ దాడులకు సమర్ధవంతంగా అడ్డుకుంది. 

పాకిస్థాన్ దాడులపై భారత రక్షణ శాఖ స్పందించింది. భారత భద్రతాదళాలు పాకిస్థాన్ దాడులను తిప్పికొట్టిందని వెల్లడించారు. జమ్మూ, పఠాన్ కోట్, ఉదంపూర్ సైనిక స్థావరాలను టార్గెట్ గా చేసుకుని దాడులకు తెగబడ్డట్లు రక్షణ శాఖ తెలిపింది. అంతర్జాతీయ సరిహద్దును దాడుకుని వచ్చి డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడులకు దిగినట్లు తెలిపారు.  

పాకిస్థాన్ నుండి ఎదురైన ముప్పును పసిగట్టి భారత రక్షణ వ్యవస్థలను అలర్ట్ చేసామని...  కైనెటిక్ మరియు నాన్ కైనెటిక్  సామర్థ్యాన్ని ఉపయోగించి పాక్ మిస్సైల్స్ ని నిర్వీర్యం చేసామని తెలిపారు. ఈ దాడుల్లో ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగలేదని భారత రక్షణ శాఖ స్పష్టం చేసింది. 

పాకిస్థాన్ నుండి ఎలాంటి దాడులు జరిగినా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. భారత సమగ్రతను కాపాడతామని... దేశ ప్రజల రక్షణే తమ ధ్యేమయని రక్షణ శాఖ ఎక్స్ వేదికన ప్రకటించింది. 

 


 

Read more Articles on
click me!