India Pakistan: కాల్పుల విరమణ ఉల్లంఘన.. పాకిస్తాన్ కు భార‌త్ వార్నింగ్

Published : May 10, 2025, 11:23 PM ISTUpdated : May 11, 2025, 12:53 AM IST
India Pakistan: కాల్పుల విరమణ ఉల్లంఘన.. పాకిస్తాన్ కు భార‌త్ వార్నింగ్

సారాంశం

  Pakistan violates ceasefire: కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే పాకిస్తాన్ భారతదేశంతో కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్ లో మ‌రోసారి దాడుల‌కు పాల్ప‌డటంతో పాకిస్తాన్ కు భారత్ వార్నింగ్ ఇచ్చింది. 

India warns Pakistan over ceasefire violations at border: భారత్-పాకిస్తాన్ సరిహద్దులో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సైనిక చర్యలను నిలిపివేయడానికి ఇద్దరు దేశాల డైరెక్టర్లు జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOs) మధ్య శ‌నివారం సాయంత్రం ఓ అవగాహన కుదిరిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి తెలిపారు. అయితే, కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని పాకిస్తాన్ తాజాగా ఉల్లంఘిస్తోందని తెలిపారు. 

విదేశాంగ కార్యదర్శి మిశ్రి విలేకరులతో మాట్లాడుతూ.. "ఈ అక్రమ ప్రవేశం అత్యంత ఖండనీయం. దీనికి పాకిస్తానే బాధ్యత వహించాలి. ఈ పరిణామాన్ని పాకిస్తాన్ సరిగా అర్థం చేసుకోవాలని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మేము ఆశిస్తున్నాం" అని అన్నారు.

అలాగే, భారత సైన్యానికి ఈ ఉల్లంఘనలకు గట్టి ప్రతిచర్య ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు మిశ్రి వెల్లడించారు. ఈ విషయంలో మన ఆర్మీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టు పేర్కొన్నారు. "ఈ ఉదయం జరిగిన అవగాహనకు విరుద్ధంగా పాకిస్తాన్ సైన్యం ప్రవర్తిస్తోంది. భారత సైన్యం దీనికి సమర్థంగా స్పందిస్తోంది. సరిహద్దులో జరుగుతున్న ఈ దాడుల‌ను నిలిపివేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది" అని మిశ్రి స్పష్టం చేశారు.

ఇటువంటి ఉల్లంఘనలపై పాకిస్తాన్ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల‌న్నారు. భారత ప్రభుత్వం ఈ విషయంలో తీవ్రంగా స్పందిస్తోందని, భద్రతా పరంగా దేశానికి భంగం కలిగే చర్యలను సహించబోదని ఆయన స్పష్టం చేశారు.
 

పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనతో దాడుల‌కు తెగ‌బ‌డిన ప్రాంతాలు: 


1. ఉధంపూర్
2. అఖ్నూర్
3. నౌషెరా
4. పూంచ్
5. రాజౌరి
6. మెంధర్
7. జమ్మూ
8. సుందర్‌బాని
9. RS పురా
10. అర్నియా
11. కతువా

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం