ఇండియాలో రికార్డులు తిరగరాస్తున్న కరోనా కేసులు:24 గంటల్లో 3.32 లక్షల కేసులు, 2256 మంది మృతి

By narsimha lode  |  First Published Apr 23, 2021, 9:45 AM IST

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది.నిన్నటితో పోలిస్తే ఇవాళ ఇంకా కేసులు పెరిగాయి.
 


న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది.నిన్నటితో పోలిస్తే ఇవాళ ఇంకా కేసులు పెరిగాయి.గత 24 గంటల వ్యవధిలో ఇండియాలో 3,32,503 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 16,257,309కి చేరుకొన్నాయి.  ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు ఏ దేశంలో కూడ నమోదు కాలేదు. 

గతంలో అమెరికా దేశంలో ఒక్క రోజు వ్యవధిలో 3.07 లక్షల కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో మాత్రం 3.15 లక్షల కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే కరోనాతో సుమారు 2,256 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనాతో మరణించిన రోగుల సంఖ్య 1,86,928కి చేరుకొంది. దేశంలో ఇంకా 2.4 మిలియన్ కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖాధికారులు ప్రకటించారు.

Latest Videos

undefined

దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు  ప్రధాని నరేంద్రమోడీ వరుసగా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో ఒక్క రోజు వ్యవధిలో రికార్డు స్థాయిలో కరోనాతో రోగులు మరణించారు.  ఒక్క రోజులోనే 306 మంది రోగులు చనిపోయారు. అంతేకాదు సుమారు 36 వేల కేసులు రికార్డయ్యాయి.  ఇక మహారాష్ట్రలో 67,013 కేసులు రికార్డయ్యాయి. 568 మరణించారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో 34,379 కేసులు రికార్డయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 40,94,840 కేసులు రికార్డయ్యాయి.  కేరళలో 13,22,054 కర్ణాటకలో11,09,650తమిళనాడులో9,62,935 కేసులు రికార్డయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో 9,42,135,యూపీలో 9,76,765,ఢిల్లీలో9,56,,348 కేసులు రికార్డయ్యాయి. 


 

click me!