ఆక్సిజన్ కొరతతో 25 మంది మృతి: వాస్తవం లేదన్న గంగారాం ఆసుపత్రి ఛైర్మెన్,

Published : Apr 23, 2021, 09:24 AM ISTUpdated : Apr 23, 2021, 01:40 PM IST
ఆక్సిజన్ కొరతతో 25 మంది మృతి: వాస్తవం లేదన్న గంగారాం ఆసుపత్రి ఛైర్మెన్,

సారాంశం

న్యూఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో గత 24 గంటల వ్యవధిలో 25 మంది రోగులు మరణించినట్టుగా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని గంగారాం ఆసుపత్రి ఛైర్మెన్ ప్రకటించారు. పలు కారణాలతో 25 మంది మరణించారని ఆయన తెలిపారు.     

న్యూఢిల్లీ:న్యూఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో గత 24 గంటల వ్యవధిలో 25 మంది రోగులు మరణించినట్టుగా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని గంగారాం ఆసుపత్రి ఛైర్మెన్ ప్రకటించారు. పలు కారణాలతో 25 మంది మరణించారని ఆయన తెలిపారు.  .శుక్రవారంనాడు ఉదయం 8 గంటలకు  గంగారామ్ ఆసుపత్రి వర్గాలు మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశాయి. 

ఈ ప్రకటన మేరకు  తమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 25 మంది రోగులు మృతి చెందినట్టుగా ఆ ప్రకటనలో ఉన్నట్టుగా జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో వాస్తవం లేదని ఆసుపత్రి ఛైర్మెన్ స్పష్టం చేశారు.  25 మంది రోగుల మృతికి పలు రకాల కారణాలున్నాయని ఆయన వివరించారు. ఆసుపత్రిలో మరో రెండుగంటల వరకు మాత్రమే ఆక్సిజన్ నిల్వలున్నాయనే వార్తల్లో వాస్తవం లేదని ఆయన వివరించారు. గంగారాం ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా 25 మంది గత 24 గంటల్లో వచ్చిన ట్టుగా జాతీయ మీడియా పెద్ద ఎత్తున  ప్రాచరుర్యం కల్పించింది. అయితే ఈ విషయంలో వాస్తవం లేదని శుక్రవారం నాడు మధ్యాహ్నం ఆసుపత్రి ఛైర్మెన్ స్పష్టం చేశారు. 

 

గంగారాం ఆసుపత్రి ఛైర్మెన్  ఏమన్నారంటే..

తమ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా ఎవరూ కూడ మరణించలేదని  గంగారాం ఆసుపత్రి ఛైర్మెన్ శుక్రవారం నాడు ప్రకటించారు. ఆక్సిజన్ కొరత లేదన్నారు. ప్రతి రోజూ 9 వేల నుండి 10 వేల క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్  తమకు సరఫరా అవుతోందని ఆయన వివరించారు. 


 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !