చెత్త బుట్టలో పది సవర్ల బంగారం దొరకడంతో...

Published : Apr 23, 2021, 09:34 AM ISTUpdated : Apr 23, 2021, 09:38 AM IST
చెత్త బుట్టలో పది సవర్ల బంగారం దొరకడంతో...

సారాంశం

ఆ నగలను  అదే ప్రాంతానికి చెందిన మహిళదని గుర్తించి పోలీసులు ఆమెకు అందజేశారు. కొరుక్కుపేట అంజనేయనగర్‌ ఆటుదొడ్డి ప్రాంతానికి చెందిన మోహన్‌సుందరం పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 

మీకు రోడ్డు మీద గ్రామ్ బంగారం దొరికితే ఏం చేస్తారు..? వెంటనే తీసుకొని జేబులో వేసుకుంటాం కదా.. కానీ.. ఓ పారిశుధ్య కార్మికుడికి పది సవర్ల బంగారం దొరికినా వెంటనే తీసుకువెళ్లి ఉన్నతాధికారులకు ఇచ్చాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నైలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చెన్నై స్థానిక కొరుక్కుపేటలో చెట్టబుట్టలో ఓ పారిశుధ్య కార్మికుడికి పది సవర్ల బంగారం దొరికింది. దీంతో.. వెంటనే తీసుకువెళ్లి కార్పొరేషన్ కి అప్పగించాడు. ఆ నగలను  అదే ప్రాంతానికి చెందిన మహిళదని గుర్తించి పోలీసులు ఆమెకు అందజేశారు. కొరుక్కుపేట అంజనేయనగర్‌ ఆటుదొడ్డి ప్రాంతానికి చెందిన మోహన్‌సుందరం పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 

గురువారం ఉదయం ఏకప్పన్‌వీథి - కన్నన్‌ వీధి కూడలిలో చెత్త విడదీస్తుండగా ఓ బరువైన సంచి కనిపించింది. అందులో చూడగా పది సవర్ల నగలు కనిపించాయి. వెంటనే ఆ నగలను కొరుక్కుపేట సీఐ తవమణికి అప్పగించారు. ఆ తర్వాత పోలీసులు  విచారణ జరిపి ఆ నగలు రంగనాధపురం క్వార్టర్స్‌లో నివసిస్తున్న మునియమ్మాళ్‌దని కనుగొన్నారు. 

తన నగలు దొరికిన విషయం తెలుసుకున్న మునియమ్మాళ్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్ళి వాటిని తీసుకున్నారు. గురువారం వడపళనిలో జరుగనున్న కుమార్తె వివాహానికి ఆ నగలను తీసుకెళ్తుండగా చెత్తసంచులను చెత్తబుట్టలో వేస్తూ పొరపాటున నగలున్న సంచిని కూడా  వేసినట్లు పోలీసులకు తెలిపారు. తన నగలను అప్పగించిన పారిశుధ్య కార్మికుడిని మునియమ్మాళ్‌, పోలీసులు ప్రశంసించారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌