ఆరోగ్య రంగంలో విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది - ప్రధాని మోడీ

Published : Mar 06, 2023, 03:49 PM IST
ఆరోగ్య రంగంలో విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది - ప్రధాని మోడీ

సారాంశం

చికిత్సను చౌకగా అందించడం తమ ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యమైన అంశం అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆరోగ్య రంగంలో ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండేందుకు భారత్ నిరంతరం ప్రయత్నిస్తోందని తెలిపారు. 

ఆరోగ్య రంగంలో విదేశాలపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడానికి తమ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉద్ఘాటించారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో మందులు, వ్యాక్సిన్లు, వైద్య పరికరాలు వంటి ప్రాణాలను కాపాడే సాధనాలు ఆయుధంగా మారాయని చెప్పారు. ‘‘హెల్త్ అండ్ మెడికల్ రీసెర్చ్’’ అనే అంశంపై బడ్జెట్ అనంతర వెబినార్ లో మోడీ ప్రసంగిస్తూ.. దశాబ్దాలుగా భారత ఆరోగ్య రంగం సమగ్ర విధానం, దీర్ఘకాలిక దార్శనికత లోపించిందని అన్నారు. అయితే తమ ప్రభుత్వం దీనిని కేవలం ఆరోగ్య మంత్రిత్వ శాఖకు మాత్రమే పరిమితం చేయలేదని, మొత్తం ప్రభుత్వ దృక్పథంగా చూసిందని అన్నారు. 

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. నెలకు రూ.2,500 భృతి

భారతదేశం ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోకుండా, స్వయం సమృద్ధి సాధించేలా మన పారిశ్రామికవేత్తలు చూడాలని ప్రధాని తెలిపారు. ఈ రంగంలో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. 

చికిత్సను చౌకగా అందించడం అత్యంత ప్రాధాన్యమని ప్రధాని మోడీ అన్నారు. ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ‘ఆయుష్మాన్ భారత్’ద్వారా పౌరులకు రూ.80,000 కోట్లు, తక్కువ ధరలకు మందులు విక్రయించే ‘జన ఔషధి’ కేంద్రాల ద్వారా పౌరులకు రూ.20,000 కోట్లు ఆదా అయ్యాయని  చెప్పారు. మహమ్మారి సమయంలో దేశ ఫార్మా రంగం ప్రపంచ విశ్వాసాన్ని పొందిందని అన్నారు. 

దుబాయ్‌లో మంచి జాబ్ అని చెప్పి లిబియాలో కట్టుబానిసలుగా గొడ్డు చాకిరి.. 12 మంది బాధితులను రక్షించిన కేంద్రం

కోవిడ్ కు ముందు, కోవిడ్ అనంతర విభజన రేఖతో ఆరోగ్య రంగాన్ని చూడాలని, ఇలాంటి సంక్షోభ సమయంలో సంపన్న దేశాల అభివృద్ధి చెందిన వ్యవస్థలు కూడా నాశనమవుతున్నాయని మహమ్మారి చూపించిందని ప్రదాని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం కేవలం ఆరోగ్య సంరక్షణపై మాత్రమే దృష్టి పెట్టడం లేదని, ప్రజల సంపూర్ణ శ్రేయస్సుపై దృష్టి సారించిందని ఆయన అన్నారు.

కాలం చెల్లిన మరో 65 చట్టాలను తొలగిస్తాం.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆ బిల్లు ప్రవేశపెడతాం - కిరెన్ రిజిజు

ఇప్పుడు కీలకమైన ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను ద్వితీయ శ్రేణి నగరాలు, చిన్న ఆవాసాలకు తీసుకువెళుతున్నామని, ఇది అక్కడ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి దారితీస్తుందని ఆయన అన్నారు. ప్రజలు తమ ఇళ్లకు సమీపంలోనే టెస్టింగ్ సౌకర్యాలతో పాటు చికిత్స పొందేలా చూడటంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధాని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu