మహమ్మారి సమయంలో పేదలకే మొదటి ప్రాధాన్యతనిచ్చాం : ప్రధాని మోది

By AN TeluguFirst Published Aug 7, 2021, 2:09 PM IST
Highlights

"కరోనా కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కోవాలనే వ్యూహంలో భారతదేశం పేదలకు మొదటి ప్రాధాన్యతనిచ్చింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన,ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ యోజన అయినా, సంక్షోభం మొదటి రోజు నుండే మేము పేదలకు ఆహారం, ఉపాధి గురించి ఆలోచించాం”అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం మధ్యప్రదేశ్‌లోని ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన (PM-GKAY) లబ్ధిదారులతో  సంభాషించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. భారతదేశం కోవిడ్ -19 మహమ్మారి సంక్షోభం సమయంలో పేదలకే తన మొదటి ప్రాధాన్యతనిచ్చిందని తెలియజేశారు. 

"కరోనా కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కోవాలనే వ్యూహంలో భారతదేశం పేదలకు మొదటి ప్రాధాన్యతనిచ్చింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన,ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ యోజన అయినా, సంక్షోభం మొదటి రోజు నుండే మేము పేదలకు ఆహారం, ఉపాధి గురించి ఆలోచించాం”అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

కోవిడ్ -19 మహమ్మారి సమయంలో 80 కోట్ల మందికి పైగా పౌరులకు ఉచిత రేషన్ అందించామని ప్రధాని తెలిపారు. "మహమ్మారి సమయంలో 80 కోట్లకు పైగా పౌరులకు ఉచిత రేషన్ అందింది. లాక్‌డౌన్ సమయంలో కేవలం గోధుమలు, బియ్యం లేదా పప్పులు మాత్రమే కాకుండా 8 కోట్ల పేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా అందించబడ్డాయి. 20 కోట్లకు పైగా మహిళల జన్ ధన్ బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ. 30,000 కోట్లు పడ్డాయి ”అని ప్రధాని మోదీ అన్నారు.

మధ్యప్రదేశ్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా.. వరదలతో జనజీవనం అస్తవ్యస్తం కావాడం మీద ప్రధాని ఆవేదనను వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి "దురదృష్టకరం" అని పేర్కొన్నారు.

"మధ్యప్రదేశ్ లోని అనేక జిల్లాలు వర్షం, వరదలతో నానా ఇబ్బందులు పడుతుంటడడం దురదృష్టకరం. అనేక మంది ప్రజల రోజువారి జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. జీవనోపాధి కోల్పోయారు. ఈ సంక్షోభ సమయాల్లో భారత ప్రభుత్వం, మొత్తం దేశం మధ్యప్రదేశ్‌ కు తోడుగా నిలుస్తుంది, ”అని ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన లబ్ధిదారులతో పరస్పర చర్చలో ప్రధాని మోదీ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా ఆయన మాట్లాడారు, “సిఎమ్ శివరాజ్, అతని మొత్తం బృందం ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి సహాయక చర్యలు చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన ఎలాంటి సాయం అయినా.. అది ఎన్డీఆర్ఎఫ్, సెంట్రల్ ఫోర్స్ లేదా ఎయిర్ ఫోర్స్ ఏదైనా..కేంద్రం వెంటనే అందిస్తుంది.. అని మోదీ అన్నారు. 

గత కొన్నేళ్లుగా  పేదలను బలం చేకూర్చేలా, సాధికారత ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని నొక్కిచెప్పారు. "మధ్యప్రదేశ్ లో రోడ్ల పరిస్థితి, పెద్ద స్కామ్‌ల గురించి మాకు తెలుసు ఈరోజు మధ్యప్రదేశ్ లో నగరాలు పరిశుభ్రత, అభివృద్ధి కోసం కొత్త నమూనాలను సృష్టిస్తున్నాయి. నేడు, దేశంలోని ప్రతి గ్రామంలో రోడ్లు నిర్మించబడుతున్నాయి. , కొత్త ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి, రైతులకు మార్కెట్‌ల సౌకర్యం ఉంది, పేద ప్రజలు అనారోగ్యం సమయంలో ఆసుపత్రికి సకాలంలో చేరుకోగలుగుతున్నారు” అని అన్నారాయన.

click me!