సెల్ ఫోన్ ల కంటైనర్ ను వెంటాడి.. రూ. 6కోట్ల విలువైన మొబైల్స్ దోచేసిన దొంగలముఠా...

Published : Aug 07, 2021, 12:47 PM IST
సెల్ ఫోన్ ల కంటైనర్ ను వెంటాడి.. రూ. 6కోట్ల విలువైన మొబైల్స్ దోచేసిన దొంగలముఠా...

సారాంశం

పోలీసుల కథనం మేరకు  చెన్నై నుంచి బెంగళూరుకు  ఎమ్ఐ కంపెనీకి చెందిన  సెల్ఫోన్ల లోడుతో గురువారం సాయంత్రం పీజీ ట్రాన్స్పోర్ట్ కు చెందిన కంటైనర్ లారీ (నెంబర్ కేఏ01ఏపీ6824) బయలుదేరింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ముళబాగిలు తాలూకా దేవరాయసముద్ర గ్రామ సమీపంలోకి చేరుకోగానే కారులో వెంటాడిన ఎనిమిది మంది దుండగులు  లారీని అడ్డగించారు.

చెన్నై - బెంగుళూరు జాతీయ రహదారి-75 పై దోపిడీదారులు చెలరేగిపోయారు. కంటైనర్‌ లారీని అడ్డుకుని రూ.6.4 కోట్ల విలువైన సెల్ఫోన్లను దోపిడీ చేశారు.  ఈ ఉదంతం కర్ణాటకలోని కోలారు జిల్లా, ముళబాగిలు తాలూకాలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. చైనా మొబైల్ కంపెనీ షావోమీకి చెందిన ఎంఐ కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్లతో బయలుదేరిన కంటైనర్ ను వెంటాడి మరీ దోచుకున్న వైనం కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

పోలీసుల కథనం మేరకు  చెన్నై నుంచి బెంగళూరుకు  ఎమ్ఐ కంపెనీకి చెందిన  సెల్ఫోన్ల లోడుతో గురువారం సాయంత్రం పీజీ ట్రాన్స్పోర్ట్ కు చెందిన కంటైనర్ లారీ (నెంబర్ కేఏ01ఏపీ6824) బయలుదేరింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ముళబాగిలు తాలూకా దేవరాయసముద్ర గ్రామ సమీపంలోకి చేరుకోగానే కారులో వెంటాడిన ఎనిమిది మంది దుండగులు  లారీని అడ్డగించారు.

 డ్రైవర్ ను తాళ్లతో బంధించి నిర్జన ప్రదేశంలో వదిలేసి, సెల్ ఫోన్ల లారీతో ఉడాయించారు. నేర్లహళ్లి గ్రామం వద్ద సెల్ఫోన్లను మరో లారీలోకి తరలించి తీసుకెళ్లారు. తెల్లవారుజామున డ్రైవర్ కట్లు విప్పుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెంట్రల్ జోన్ ఐజీ చంద్రశేఖర్,  కోలార్ ఎస్ పి కిషోర్ బాబు,  డి ఎస్ పి గోపాల్ నాయక్, ముళబాగిలు ఎస్ఐ ప్రదీప్ సింగ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డిఎస్పి గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో  ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu