AMAR JAWAN JYOTI: ఆరిపోనున్న‌ అమర జవాను జ్యోతి

By Rajesh KFirst Published Jan 21, 2022, 10:33 AM IST
Highlights

AMAR JAWAN JYOTI: 1971లో భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంలో అమరులైన సైనికుల జ్ఞాపకార్థం ఢిల్లీలోని ఇండియా గేట్ వ‌ద్ద  అమర జవాన్ జ్యోతి లేదా ‘ఎటర్నల్ ఫ్లేమ్’ ఏర్పాటు చేశారు. ఈ జ్యోతి గ‌త 50 ఏళ్లుగా నిరంతరంగా వెలుగుతునే ఉంది. అయితే.. ‘అమర జవాన్ జ్యోతి’ శుక్రవారం ఆరిపోయి చరిత్రలో కలిసిపోనుంది.
 

AMAR JAWAN JYOTI: 1971లో భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధంలో అమరులైన సైనికుల జ్ఞాపకార్థం ఢిల్లీలోని ఇండియా గేట్ వ‌ద్ద  అమర జవాన్ జ్యోతి లేదా ‘ఎటర్నల్ ఫ్లేమ్’ ఏర్పాటు చేశారు. ఈ జ్యోతి గ‌త 50 ఏళ్లుగా నిరంతరంగా వెలుగుతునే ఉంది. అయితే.. ‘అమర జవాన్ జ్యోతి’ శుక్రవారం ఆరిపోయి చరిత్రలో కలిసిపోనుంది.

దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్  ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ యుద్ధ స్మారకం (NWM)లో దీనిని విలీనం చేయాల‌ని భావిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రెండు జ్వాలలను కలిపే మహోన్నత కార్యక్రమంలో అమర్ జవాన్ జ్యోతిలోని కొంత భాగాన్ని జాతీయ యుద్ధ స్మారకానికి తీసుకువెళతారు’ అని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు గురువారం వెల్లడించారు.

అమర్ జవాన్ జ్యోతి

మొదటి ప్రపంచ యుద్ధం (1914-1918), మూడవ ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధం (1919)లో మరణించిన భారత సైనికుల స్మారకార్ధం నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఇండియా గేట్‌ను నిర్మించింది. ఆల్ ఇండియా వార్ మెమోరియల్ ఆర్చ్ 42 మీటర్ల స్థూపంపై సైనికుల పేర్లు చెక్కించారు.
తర్వాత 1971 బంగ్లా విమోచన యుద్ధంలో వీరమరణం పొందిన భారత సైనికుల గౌరవార్ధం  1972లో ఇందిర హాయంలోని  అమర జవాన్ జ్యోతి ఆర్చి నిర్మించింది. అప్పటి నుంచి ఇక్కడ 50 ఏళ్లుగా అమర జవాన్ జ్యోతి ఏకధాటిగా వెలుగుతోంది. రిపబ్లిక్ డే, స్వాతంత్ర దినోత్సవం వంటి జాతీయ స్థాయి ఉత్సవాల సందర్భంగా సైనికులకు ఇక్కడ నివాళలర్పిస్తుంటారు.
 

నేషనల్ వార్ మెమోరియల్

మూడేళ్ల కిందట కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించింది. 2019లో నేషనల్ వార్ మెమోరియల్‌ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 1947 నుండి దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన సైనికుల జ్ఞాపకార్థం దీనిని నిర్మించారు. నూత‌నంగా నిర్మించిన‌..  మెమోరియల్ ఇండియా గేట్ కాంప్లెక్స్‌లో 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్క‌డ సూప్తంపై  అమ‌ర సైనికుల పేర్లను చెక్కారు.  
అయితే... రెండు స్మారకాల నిర్వహణ కష్టంగా మారడంతోనే అమర జవాన్ జ్యోతిని, జాతీయ యుద్ధ స్మారకంలో విలీనం చేయాలని నిర్ణయించినట్టు అధికారులు పేర్కొంటున్నారు.

అయితే, అమర జవాన్ జ్యోతి,  జాతీయ యుద్ధ స్మారకంలో క‌ల‌ప‌డంపై భిన్న స్వ‌రాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. అమ‌ర జవాన్ల పవిత్రకు భంగం క‌లుగుతోంది.  అమర జవాన్ జ్యోతికి మన ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోన్నారు. విలీనం చేయడం తప్పుకాదని  నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్ అంటున్నారు.

7 దశాబ్దాలుగా జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని నిర్మించని వారు ఇప్పుడు మన అమరవీరులకు శాశ్వతంగా, సముచితంగా నివాళులు అర్పిస్తున్నప్పుడు కేకలు వేయడం విడ్డూరంగా ఉంద‌ని ప్ర‌తిప‌క్షాలు  ఆరోపిస్తున్నారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో భగ్గుమన్నాయి. 

కొందరు దేశభక్తిని, త్యాగాన్ని అర్థం చేసుకోలేరంటూ కాంగ్రెస్  నేత‌ రాహుల్ గాంధీ  విరుచుకుపడ్డారు. జ‌వాన్ల శౌర్యపరాక్రమాలు చాటిన జవాన్ల స్మారకార్థం వెలిగిన జ్యోతి ఈ రోజు ఆరోపోవడం విచారకరమని  ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే.. అమర జవాను జ్యోతిని మళ్లీ వెలిగిస్తామని అన్నారు. 

click me!