పెళ్లైంది.. ఇద్దరు పిల్లలు పుట్టారు.. అయినా పాత ప్రియుడిని మరిచిపోలేక...

Published : Jan 21, 2022, 10:08 AM IST
పెళ్లైంది.. ఇద్దరు పిల్లలు పుట్టారు.. అయినా పాత ప్రియుడిని మరిచిపోలేక...

సారాంశం

పెళ్లయి.. ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా ఆమె loverని మరిచిపోలేదు. అతనితో కాంటాక్ట్ లో ఉంది. అతనితో extra marital affair పెట్టుకుంది. అతడూ తరచూ ఆమె ఇంటిచి చాటుగా వచ్చి వెల్తుండేవాడు. దాంతో మహిళ భర్తకు ఈ విషయం తెలిసింది. గ్రామపెద్దలకు వీరి నిర్వాకాన్ని ఫిర్యాదు చేశాడు. 

మైసూరు : Karnatakaలో పెళ్లయి, ఇద్దరు పిల్లలున్న ఓ మహిళ... మరో యువకుడితో ప్రేమాయణం సాగించడం మొదలుపెట్టింది. దీనిమీద 
Village elders కన్నెరజేశారు. ఆమెను మందలించి, ఆమె ప్రియుడికి దేహశుద్ధి చేశారు. కర్ణాటక రాష్ట్రం నంజనగూడు తాలూకాలోని హళ్లిదిట్టి గ్రామంలో ఇది జరిగింది. కొంతెగాల గ్రామానికి చెందిన మహేష్ కుమార్, పొరుగున మసగే గ్రామానికి చెందిన యువతి పీయూసీలో ఉన్నప్పుడు love చేసుకున్నారు. ఇది తెలిసి ఆమె తల్లిదండ్రులు హళ్లిదిడ్డికి చెందిన మరో యువకునితో marriage జరిపించారు. 

అయితే పెళ్లయి.. ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా ఆమె loverని మరిచిపోలేదు. అతనితో కాంటాక్ట్ లో ఉంది. అతనితో extra marital affair పెట్టుకుంది. అతడూ తరచూ ఆమె ఇంటిచి చాటుగా వచ్చి వెల్తుండేవాడు. దాంతో మహిళ భర్తకు ఈ విషయం తెలిసింది. గ్రామపెద్దలకు వీరి నిర్వాకాన్ని ఫిర్యాదు చేశాడు. ఇంతలో గురువారం నాడు గ్రామానికి వచ్చిన మహేష్ ను గ్రామ పెద్దలు గమనించారు. మహేష్ ఆ మహిళ ఇంట్లోకి వెళ్లగానే పెద్దలు, గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని.. దేహశుద్ధి చేశారు. 

మరోవైపు, తెలంగాణలో ఓ భార్య భర్త ప్రాణాలు కాపాడడానికి తెగించి దుండగులతో పోరాటం చేసింది. వారి కళ్లలో కారం కొట్టి మరీ భర్త ప్రాణాలను కాపాడుకుంది. రంగశాయి పేట :  ఆమె సాధారణ housewife తన భర్త ప్రాణాలను కాపాడుకోవడానికి అపరకాళిలా తిరగబడింది. దుండగుల కళ్లల్లో red mirchi powder చల్లి మాంగల్యాన్ని కాపాడుకుంది. ఈ ఘటన warangal పట్టణంలోని శంభునిపేటలో చోటు చేసుకుంది. స్థానికులు, సిఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... ‘ది వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్’ అధ్యక్షుడు వేముల భూపాల్ ఇంటికి బుధవారం అర్ధరాత్రి ఆటోలో నలుగురు వ్యక్తులు వచ్చారు. వీరిలో ముగ్గురు భూపాల్ ఇంట్లోకి వెళ్లి ఆయనపై knifeలతో దాడి చేసి murder చేసేందుకు ప్రయత్నించారు.

వెంటనే భూపాల్ భార్య కళ్యాణి అప్రమత్తమైంది. వంటగదిలోకి వెళ్లి  కారం తీసుకొచ్చి దుండగులు కళ్ళలో చల్లింది. కాపాడాలంటూ పెద్దగా కేకలు వేసింది. దీంతో నిందితులు ముగ్గురూ ఆటోలో పారిపోవడానికి ప్రయత్నించారు. అంతలో అరుపులు విని భూపాల్ సోదరుడు క్రాంతికుమార్ అక్కడికి చేరుకున్నారు. కళ్లలో కారం ఎక్కువ పడడంతో నిందితుల్లో ఒకరైన రంజిత్ పారిపోలేక వారికి చిక్కాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితుడిని అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. భూపాల్, క్రాంతికుమార్ సోదరులతో ఉన్న భూ తగాదాల వల్లే  ప్రత్యర్థులు హత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Palamedu Jallikattu Begins in Madurai: తమిళనాడులో హోరా హోరీగా జల్లికట్టు| Asianet News Telugu
JIO : తక్కువ ధరకే 200 జీబీ డేటా.. జియో అద్భుత రీచార్జ్ ప్లాన్