పెరుగుతున్న కరోనా కేసులు: అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన

By narsimha lode  |  First Published Dec 18, 2023, 7:20 PM IST

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.  రాష్ట్రాలకు  పలు సూచనలు చేసింది కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ.


న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసుల్లో పెరుగుదలతో  కేంద్రం అప్రమత్తమైంది.  కరోనాపై  రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని  కేంద్ర ప్రభుత్వం సూచించింది.  అత్యధిక సంఖ్యలో ఆర్‌టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని  రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.  

కేరళ రాష్ట్రంలో  జేఎన్.1సబ్ వేరియంట్ కేసు బయటపడింది.  దీంతో  కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ  అలెర్టైంది.  దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఆసుపత్రుల్లో  వైద్య సౌకర్యాలు మెరుగు పర్చాలని కూడ వైద్య ఆరోగ్య శాఖ ఆయా రాష్ట్రాలకు సూచించింది.  కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు  కేరళ రాష్ట్రానికి చెందిన  వైద్య శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. 

Latest Videos

కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నుండి వచ్చిన ఓ వ్యక్తిని పరీక్షించిన సమయంలో  జేఎన్.1 సబ్ వేరియంట్ ను వైద్యాధికారులు గుర్తించారు.  
జేఎన్.1  వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలెర్ట్ జారీ చేసింది. ఈ కరోనా వేరియంట్ కారణంగా  ఐదుగురు మృతి చెందారు.  ఇందులో కేరళకు చెందిన నలుగురున్నారు.

ఈ ఏడాది అక్టోబర్ నుండి నవంబర్ మాసాల్లో  కరోనా కేసుల్లో పెరిగినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు  కరోనాతో  మరణాలు కూడ  చోటు చేసుకున్నాయి.  దేశంలో 28 రోజుల వ్యవధిలో  523 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.  . దేశంలో కరోనాతో ఇటీవలనే నలుగురు మరణించారు.  కరోనాపై నిఘా, రిపోర్టింగ్, ట్రాకింగ్, క్లినికల్ కేర్, వ్యాక్సినేషన్లపై కేంద్రీకరించాలని  ప్రపంచ ఆరోగ్య సంస్థ  సూచించింది.  

ఈ ఏడాది జూలైలో గుర్తించిన కరోనా బీఏ.2.86 సబ్ వేరియంట్ నుండి   ఉద్భవించినట్టుగా వైద్య ఆరోగ్యశాఖాధికారులు గుర్తించారు.  ఈ వేరియంట్ కేసులు అమెరికా సహా పలు దేశాల్లో నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ కేసులు భారత దేశంలో నమోదౌతున్నాయి.

click me!