ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సోమవారంనాడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ నెల 21న విచారణకు రావాలని ఆ నోటీసులో కోరింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్‌పోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు పంపారు.ఈ నెల 21న విచారణకు రావాలని ఆ నోటీసులో కోరారు.వారం నుండి పది రోజుల పాటు మెడిటేషన్ కోర్సు కోసం బయలుదేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు పంపారు. ఢిల్లీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన మరునాడే కేజ్రీవాల్ మెడిటేషన్ కోర్సు కోసం బయలుదేరనున్నారు. ఈ నెల 19న మెడిటేషన్ కోర్సు కోసం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీని వీడే అవకాశం ఉందని సమాచారం.
విపస్సనా అనేది పురాతన భారతీయ ధ్యాన పద్దతి.చాలా కాంగా విపాసన మెడిటేషన్ సాధన చేస్తున్నారు సీఎం కేజ్రీవాల్. ధ్యాన విధానాన్ని అభ్యసించడానికి బెంగుళూరు,జైపూర్ తదితర ప్రాంతాలకు అరవింద్ కేజ్రీవాల్ గతంలో వెళ్లారు.ప్రతి ఏటా పది రోజుల పాటు ఈ కోర్సుకు అరవింద్ కేజ్రీవాల్ వెళ్తారు. ఈ ఏడాది డిసెంబర్ 19 నుండి డిసెంబర్ 30 వరకు అరవింద్ కేజ్రీవాల్ ఈ మెడిటేషన్ కోర్సు కోసం వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై గతంలో కూడ అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది. నవంబర్ 2న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 16న సీబీఐ అధికారులు కేజ్రీవాల్ ను తొమ్మిది గంటల పాటు విచారించారు.
ఆమ్ ఆద్మీ పార్టీలోని ఇద్దరు అగ్రనేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ లు ఢిల్లీ లిక్కర్ స్కాం లో మనీలాండరింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలతో జైలులో ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 4న ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి మనీష్ సిసోడియా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై దాఖలు చేసిన చార్జీషీట్ లో మనీష్ సిసోడియాను కీలక కుట్రదారుగా ఈడీ ఆరోపణలు చేసింది.