ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌పై మరోసారి బ్యాన్: మే 31వరకు నిషేధం పొడిగింపు

By narsimha lodeFirst Published Apr 30, 2021, 4:05 PM IST
Highlights

అంతర్జాతీయ విమాన సర్వీసులను  ఈ ఏడాది మే 31వ తేదీ వరకు నిషేధం విధిస్తూ ఇండియా నిర్ణయం తీసుకొంది. 
 

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసులను  ఈ ఏడాది మే 31వ తేదీ వరకు నిషేధం విధిస్తూ ఇండియా నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు శుక్రవారం నాడు డీజీసీఏ  జాయింట్ డైరెక్టర్ జనరల్ సునీల్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే కార్గో సర్వీసులకు ఇది వర్తించదని ఇండియా తెలిపింది. అలాగే డీజీసీఏ ఇప్పటికే  ఎంపిక చేసిన మార్గాల్లో మాత్రం ప్యాసింజర్ విమానాలు నడుస్తాయని ఆయన ఆ ప్రకటనలో వివరించారు.

గత ఏడాది కరోనా కేసులు తీవ్రంగా ఉన్న సమయంలో కూడ అంతర్జాతీయ విమానాలపై ఇండియా నిషేధం విధించిన విషయం తెలిసిందే. 2020 మార్చి మాసంలో అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించారు. దేశంలో లాక్‌డౌన్ విధించిన సమయంలో  అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించారు. విదేశాల్లో చిక్కుకొన్న ఇండియన్లను స్వదేశానికి రప్పించేందుకు వందే భాతర్ మిషన్ ను 2020 మేలో ఇండియ ప్రారంభించింది. ఇండియాలో కరోనా కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో బ్రిటన్ సహా పలు దేశాలు  ఇండియా విమానాలపై నిషేధం విధించాయి. 
 

click me!