ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కరోనా.. అయినా ఇంటి నుంచే విధులు

By Siva KodatiFirst Published Apr 30, 2021, 4:05 PM IST
Highlights

ఢిల్లీలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఈ మహమ్మారి బారినపడ్డారు. ఇప్పటికే సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆయన భార్య‌కు కోవిడ్ సోకిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కరోనా బారిన పడ్డారు. 

తనకు కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలినట్టు గవర్నర్ స్వయంగా వెల్లడించారు. తన నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉంటూనే.. ఢిల్లీలో పరిస్థితిని పర్యవేక్షిస్తానని అనిల్ అన్నారు. ఇంటి నుంచే యధావిధిగా తన విధులు నిర్వహిస్తానని అనిల్ వెల్లడించారు.

ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ కోరారు.  కాగా గత నెలలోనే అనిల్ బైజాల్ తన సతీమణితో కలిసి కొవిడ్ వ్యాక్సీన్ తొలి డోసు వేసుకున్నారు. 

Also Read:అలా చేస్తే కోర్టు ధిక్కారమే: కేంద్రంపై విరుచుకుపడిన సుప్రీంకోర్టు

కాగా, దేశ రాజధాని ఢిల్లీలో వ్యాక్సిన్ నిల్వలు, లభ్యతపై సీఎం కేజ్రీవాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రేపటి నుంచి వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద క్యూలు కట్టొద్దని ప్రజలకు సూచించారు. తగినన్ని వ్యాక్సిన్లు వచ్చిన తర్వాత తెలియజేస్తామని.. అప్పుడు వ్యాక్సినేషన్ కోసం రావాల్సిందిగా సీఎం కేజ్రీవాల్ ప్రజలను అభ్యర్థించారు.

కొద్దిరోజుల పాటు వ్యాక్సిన్ సెంటర్ల వద్ద క్యూలు కట్టొద్దని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కోవిన్ పోర్టల్‌లో చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. కానీ ఇప్పటి వరకూ వ్యాక్సిన్ డోసులు రాష్ట్రానికి చేరలేదని ఆయన చెప్పారు.

click me!