ఈ ఏడాది జూలై 15వ తేదీ వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు డీజీసీఏ శుక్రవారం నాడు సర్క్యులర్ ను విడుదల చేసింది. జూలై 15వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించినట్టుగా డీజీసీఏ స్పష్టం చేసింది.
హైదరాబాద్:ఈ ఏడాది జూలై 15వ తేదీ వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు డీజీసీఏ శుక్రవారం నాడు సర్క్యులర్ ను విడుదల చేసింది. జూలై 15వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించినట్టుగా డీజీసీఏ స్పష్టం చేసింది.
ఇండియా నుండి విదేశాలకు, విదేశాలనుండి ఇండియాకు జూలై 15వ తేదీ వరకు అంతర్జాతీయ విమానాలను రద్దు చేసినట్టుగా డీజీసీఏ సర్క్యులర్ లో పేర్కొంది.
ప్రపంచంలోని ఇతర దేశాల నుండి వచ్చే కార్గో విమానాలపై ఎలాంటి ఆంక్షలు లేవని కూడ డీజీసీఏ తేల్చి చెప్పింది.
also read:డొమెస్టిక్ ఫ్లైట్స్‌కు ఈ నెల 25 నుండి అనుమతి: ప్రయాణీకులకు సూచనలు ఇవే.....
ఈ ఏడాది మే 25వ తేదీ నుండి దేశంలో డొమెస్టిక్ విమానాల రాకపోకలకు ప్రభుత్వం ప్రారంభించింది. డొమెస్టిక్ విమానాల రాకపోకల విషయంలో కూడ పలు జాగ్రత్తలు తీసుకొంది.
దేశంలో ఈ ఏడాది మార్చి 25వ తేదీ నుండి దేశంలో విమాన సర్వీసులు రద్దు చేసింది కేంద్రం. అంతర్జాతీయ సర్వీసులను తొలుత రద్దు చేసింది. అన్ని రకాల విమాన సర్వీసులను కేంద్రం నిలిపివేసింది. అయితే అవసరాన్ని బట్టి కార్గో విమాన సర్వీసులను రద్దు చేసింది.
ఇండియాలో కూడ కరోనా కేసులు 4.90 లక్షలకు చేరుకొన్నాయి. దీంతో అంతర్జాతీయ విమానాలను అనుమతి ఇస్తే కరోనా కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో నిషేధాన్ని జూలై 15వ తేదీ వరకు పొడిగించారు.