కరోనా విలయతాండవం: ఈశాన్య భారతంలోనే అగ్రస్థానం.. అసోం కీలక నిర్ణయం

By Siva KodatiFirst Published Jun 26, 2020, 4:08 PM IST
Highlights

లాక్‌డౌన్ సడలింపులతో భారతదేశంలో కేసులు వేగంగా పెరుగుతుండటంతో నగరాలు, పట్టణాల్లో లాక్‌డౌన్‌ విధిస్తున్నారు. ఈ క్రమంలో అస్సాం వేళ కీలక నిర్ణయం తీసుకుంది

లాక్‌డౌన్ సడలింపులతో భారతదేశంలో కేసులు వేగంగా పెరుగుతుండటంతో నగరాలు, పట్టణాల్లో లాక్‌డౌన్‌ విధిస్తున్నారు. ఈ క్రమంలో అస్సాం వేళ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మరికొంత కాలం పొడిగించింది.

కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో ఈ నెల 28 అర్థరాత్రి నుంచి 14 రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్ కొనసాగుతుందని మంత్రి హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. ఈ సమయంలో కేవలం మెడికల్ షాపులు మాత్రమే తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని ఇతర అర్బన్ ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో వీకెండ్ లాక్‌డౌన్ ఉంటుందని హిమంత చెప్పారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వీకెండ్ లాక్‌డౌన్ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.

Also Read:ఒక్క రోజులోనే 407 మంది మృతి: ఇండియాలో 4,90,401కి చేరుకొన్న కరోనా కేసులు

జూన్ 15 నుంచి రాష్ట్రంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. రాత్రి పూట కర్ఫ్యూ మాత్రం రాష్ట్రమంతటా కొనసాగుతుందని బిశ్వశర్మ అన్నారు.

ఈశాన్య రాష్ట్రాల్లో అసోంలోనే కరోనా ప్రభావం అత్యధికంగా ఉంది. ఇప్పటి వరకు 6,300లకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 4,033 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 9 మంది మరణించారు. ప్రస్తుతం అసోంలో 2,279 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అసోం తర్వాత మణిపూర్‌లో 702 కేసులున్నాయి. 

click me!