కాంగ్రెస్ వద్ద డబ్బుల్లేవు. అందుకే విపక్షాల సమావేశం టీ, బిస్కెట్లకే పరిమితం అయింది. అందులో సమోసా పంచనేలేదు.. అని జేడీయూ ఎంపీ సునీల్ కుమార్, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు.
INDIA Bloc: జేడీయూ ఎంపీ సునీల్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ వద్ద సమావేశంలో పాల్గొన్న సభ్యులకు సమోసాలు తినిపించడానికీ డబ్బులు లేవని అన్నారు. ఇండియా కూటమి సమావేశం గురించి ఆయన పై వ్యాఖ్య చేశారు. ఇండియా కూటమి సమావేశాల్లో టీ బిస్కెట్లతోపాటు సమోసాలు కూడా పంచేవారని వివరించారు. కానీ, నాలుగో సమావేశంలో కాంగ్రెస్ పార్టీ టీకే పరిమితం అయిందని, సమోసాలు తినిపించే డబ్బులు ఆ పార్టీ వద్ద లేవు అని అన్నారు.
‘నిన్నటి సమావేశంలో అనేక పార్టీల పెద్ద పెద్ద నేతలు పాల్గొన్నారు. ఎన్నో పెద్ద పెద్ద విషయాలు మాట్లాడాలని అనుకున్నారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. నిన్నటి భేటీ కేవలం చాయ్‌కే పరిమితం అయింది. ఎందుకంటే కాంగ్రెస్ మొన్నీ మధ్యే చెప్పింది. ఆ పార్టీ వద్ద డబ్బులు లేవని, డోనేషన్లు తీసుకుంటున్నదని చెప్పింది. ఈ విరాళాలు ఇంకా అందాల్సి ఉన్నది. కాబట్టి, నిన్నటి సమావేశం ఒక్క చాయ్, బిస్కెట్‌ల వద్దే ముగిసింది. సమోసా దాకా రాలేదు. ముఖ్యమైన అంశాలపై చర్చ జరగనేలేదు’ అని అన్నారు.
Also Read: 2024 Elections: ప్రధాని మోడీపై వారణాసి నుంచి విపక్ష కూటమి నుంచి పోటీ చేసేది ఎవరు?
ప్రతిపక్ష కూటమి ఇండియా అలయెన్స్ నేతలు నాలుగో సమావేశం ఢిల్లీలో జరిగింది. సీట్ల సర్దుబాటుపై ఈ సమావేశం నిర్వహించారు. ఇందులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విపక్ష కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే ఉండాలని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. ఆయన సున్నితంగా తిరస్కరించారు. తాజాగా మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎదుర్కొనే నేతలపై అన్వేషణ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ముగ్గురు, నలుగురి నేతల పేర్లు వినిపించాయి.